కాలంతో సంబంధం లేకుండా ఏడాదికి రెండు పంటలు
తెలంగాణ మంత్రి హరీష్ రావు

మెదక్: తెలంగాణ మంత్రి హరీష్ రావు మెదక్ జిల్లా నిజాంపేటలోని నార్లాపూర్‌లో మల్లన్న సాగర్ కాలువ పనులను ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. ఇక కాలంతో సంబంధం లేకుండా తెలంగాణలో ఏడాదికి రెండు పంటలు పండుతాయని అన్నారు. రైతులు వాన మొగులు కోసం వేచి చూసే రోజులు పోయాయని అన్నారు. మన కాల్వలను మనం తవ్వించుకోవాలి, మనం సిరులు పండించుకోవాలి అని మంత్రి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం, రైతులు కష్టాలు పడుతుంటే చూస్తు ఊరుకోదని అన్నారు. రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత వరకు రైతుబంధు పథకం, కొనసాగుతుందని అన్నారు. రైతులు పండించిన పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని అన్నారు. పంట చివరి గింజ వరకు కూడ ప్రభుత్వమే కొనుగొలు చేస్తుందని, తడిసిన ధాన్యాన్ని కూడా కొంటామని అన్నారు. ప్రస్తుతం ముఫ్పై లక్షల ఎకరాలకు సరిపడా సన్న రకం విత్తనాలు రైతులకు అందుబాటులో ఉన్నాయని మంత్రి తెలిపారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/