కార్మికులను కొనసాగించడంపై హర్షం వ్యక్తం చేసిన పవన్‌

ప్రభుత్వానికి, టిటిడికి పవన్‌ కృతజ్ఞతలు

pawan kalyan
pawan kalyan

అమరావతి: ఇటీవల టిటిడిలో 1,400 మంది ఔట్‌సోర్సింగ్‌ కార్మికులపై వేటుపడిందటు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ అన్నారు . వారిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో టిటిడిలో పనిచేసే ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులను కొనసాగిస్తామంటూ టిటిడి యంత్రాంగం ప్రకటించింది. ఈ నిర్ణయంపై ఆయన హర్షం వ్యక్తం చేస్తూ.. ఏపి ప్రభుత్వానికి, టిటిడికి కృతజ్ఞతలు తెలిపారు. 1400మంది కార్మికులను కొనసాగించాలని తీసుకున్న నిర్ణయం సముచితంగా ఉందని అన్నారు. వారంతా శ్రీవారిని నమ్ముకుని పదిహేను సంవత్సరాలుగా కొద్దిపాటి వేతనాలకే సేవ చేస్తున్నారని పవన్‌ వెల్లడించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/