కార్పొరేట్‌ పన్నును 28%కి తగ్గించాలి

TAXES
TAXES

న్యూఢిల్లీ: కార్పొరేట్‌ పన్నును ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న 30శాతంనుంచి 28శాతానికి తగ్గించాలని పారిశ్రామిక సంఘం ఫిక్కీ విజ్ఞప్తిచేసింది.రానున్న బడ్జెట్‌లో పారిశ్రామిక రంగానికి కొన్ని రాయితీలుకల్పించాలని ఫిక్కీ కోరింది. అమెరికా పన్ను సంస్కరణలఫలితంగా ఎదురయిన సమస్యలను ఈ కార్పొరేట్‌ పన్ను తగ్గింపుద్వారా పరిష్కరించుకోవచ్చని ఫిక్కీ అంచనావేసింది. 2015-16 బడ్జెట్‌లో కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ మాట్లాడుతూ కార్పొరేట్‌ పన్నును 25శాతానికి వచ్చే నాలుగేళ్లలో తగ్గిస్తామనిప్రకటించారు. అయితే ఇప్పటివరకూ పన్నురేట్లు తగ్గించలేదని ఫిక్కీ వెల్లడించింది. ఫిక్కీ కొత్త అధ్యక్షుడు రాషేష్‌ షా మాట్లాడుతూ కనీసం ఈ బడ్జెట్‌లో అయినా కేంద్రం 30 నుంచి 28శాతానికి తీసుకురాగలదని అంచనావేస్తున్నట్లు తెలిపారు. ట్రంప్‌ పాలనాయంత్రాంగం అమెరికాలో ప్రవేశపెట్టిన పన్నుల సంస్కరణలు ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలపై ప్రభావం చూపించకుండా ఉండాలంటే భారత్‌లో కార్పొరేట్‌పన్ను తగ్గించాలని కోరారు. గత ఏడాది డిసెంబరులోనే అమెరికాసెనెట్‌ రిపబ్లికన్స్‌ అమెరికా పన్ను నియమావళిని ప్రక్షాళన చేయాలని కోరారు. 30 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ పన్నునియమావళి ప్రక్షాళనచేయాల్సిందేనని అన్నారు. సెనేట్‌ 1.5 లక్షలకోట్ల డాలర్ల పన్ను బిల్లును ఆమోదించింది. శాశ్వతస్థాయిలో కార్పొరేషన్లకు పన్నుల తగ్గింపులుప్రకటించింది. వ్యక్తిగతంగా కూడా కొన్ని పన్నుల తగ్గింపునుప్రకటించింది. 51-48 ఓట్లతేడాతో ఈ బిల్లు ఆమోదం పొందింది. 28శాతానికి భారత్‌లో పన్ను తగ్గింపు మంచి పరిణామంగానే రాషేష్‌ వెల్లడించారు. ఫిబ్రవరి ఒకటవ తేదీనే కేంద్రం పార్లమెంటులో బడ్జెట్‌ప్రవేశపెడుతున్నందున పన్నుల్లో మినహాయింపులివ్వాలని బహుశా ప్రస్తుత ఎన్‌డిఎప్రభుత్వానికి ఈ ఐదేళ్లకాలంలో ఇదే బడ్జెట్‌ అని ఆయన అన్నారు. ఆర్ధికవృద్ది అంశాలపరంగాచూస్తే వచ్చే ఆర్ధిక సంవత్సరానికి ఆర్ధికవృద్ధి 7.5శాతంగా ఉండవచ్చని షా అంచనావేసారు. ఆర్ధికవ్యవస్థపరంగా కొంతమంది నిపుణులు ఏడుశాతం వృద్ధి ఉంటుందని కొందరు అంచనావేసారు. పెద్దనోట్ల రద్దు, జిఎస్‌టి అమలు వంటివి ఆర్ధికవ్యవస్థపై ప్రభావంచూపుతాయని అంచనావేసారు. ప్రభుత్వం ముందస్తు అంచనాలను బుధవారం విడుదలచేయనున్నది.దీనితో పన్నుల సంస్కరనలపరంగా కార్పొరేట్‌ పన్ను తగ్గించి ఈ రంగాన్నిమరింతగాప్రోత్సహించాలని రాషేష్‌ షా కోరాయి.