కార్పొరేట్‌, ఇన్వెస్టర్లకు ఝలక్‌

B6
RBI

కార్పొరేట్‌, ఇన్వెస్టర్లకు ఝలక్‌

ముంబై, డిసెంబరు 7: కార్పొరేట్‌ రంగం, ఆర్థికనిపుణులు, ఇన్వె స్టర్లు ఎంతో ఆతృతగా ఎదురుచూసిన తరుణంలో రిజర్వుబ్యాంకు గవర్నర్‌ ఉర్జిత్‌పటేల్‌ అందరికీ షాక్‌ ఇచ్చారు. రెపోరేట్లను 6.25 శాతం వద్దనే స్థిరంగా ఉంచుతున్నట్లు ప్రకటించారు. పెద్దనోట్ల రద్దు తర్వాత జరిగిన మొట్టమొదటి మానిటరీపాలసీ కమిటీ సమావేశానికి అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఓపక్క దేశవిదేశాల ఆర్థికవేత్తలు, ప్రభుత్వాలు పెద్దనోట్లరద్దును మెచ్చుకుంటున్న తరుణంలో ఆర్ధికవ్యవస్థ వృద్ధికి మరింతూతం ఇచ్చేవిధంగా పటేల్‌ వడ్డీరేట్లను ఆరుశాతానికి తెస్తారని అంచనా వేసారు. అయితే ఆర్‌బిఐ ఆధ్వర్యంలోని మానిటరీపాలసీ కమిటీ నిర్ణయాలను యధాతథంగా అమలుచేస్తూ స్థిరంగానే కొనసాగి స్తున్నట్లు పటేల్‌ మీడియాకు వివరించారు.

ఇప్పటికే అనేక బ్రోక రేజి సంస్థలు జిడిపివృద్ధి కొంతమేర తగ్గుతుందని అంచనావేసా యి. ప్రధాని నరేంద్రమోడీ రూ.500, రూ1000 నోట్లు రద్దు ద్వారా భారత్‌ను విస్మయానికి గురిచేసారు. చెలామణిలో ఉన్న 86శాతం కరెన్సీని రద్దుచేసి నల్లధనం, లెక్కలుతేలని గుప్తధనం, నకిలీ కరెన్సీని వెలికితీసే లక్ష్యంతోనే ఈ విధానానికి తెరతీసినట్లు ప్రకటించి మరింత సంచలనానికి తెరలేపినసంగతి తెలిసిందే. ఆర్‌బిఐ ఆర్ధ్థి వృద్ధి పరంగా స్థూల దేశీయోత్పత్తి గణాంకాలు ఈ ఆర్ధిక సంవత్సరానికి 7.6శాతం నుంచి 7.1శాతంగా ఉంటుందని అంచనావేసింది. అయితే నోట్లరద్దు ఆర్థిక వ్యవస్థను అంచనాలకు మించి దెబ్బతీసిందనే చెప్పాలి. ఆటోమొబైల్‌ విక్రయాలు దిగజారి పోయాయి. సేవలరంగ కార్యకలాపాలు మందగించాయి. గడచిన రెండేళ్లతో పోలిస్తే మరింతగా క్షీణించాయి.

రెపోరేట్లు ఖచ్చితంగా తగ్గుతాయని భావించిన అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ యధాతథంగానే కొనసాగిస్తున్నట్లు ప్రకటించి నిరాశనేమిగిల్చినట్లు చెప్పాలి. మిజుహో బ్యాంకు వ్యూహకర్త తీర్ధాంకర్‌ పట్నాయక్‌ మాట్లాడుతూ ప్రస్తుత ఎంపిసి ప్రకటన తీవ్ర అసంతృప్తికి గురి చేసిందని, పెద్దనోట్ల రద్దు ప్రకటన తర్వాత వాటి ప్రభావాన్ని పరిగణనలోనికి తీసుకుని రేట్లు తగ్గిస్తుందని ఆశించిన ఇన్వెస్టర్లకు అసంతృప్తిని మిగిల్చిందని అన్నారు. ఆర్‌బిఐ ఛీఫ్‌ ఉర్జిత్‌ పటేల్‌ ఆధ్వర్యంలోని మానిటరీ పాలసీ కమిటీ ఆరుగురుసభ్యులు కూడా రేట్లను తగ్గించేందుకు వ్యతిరేక ఓటువేసారు. దీనితో వడ్డీరేట్లు స్థిరంగానే కొనసాగించాల్సి వచ్చింది. స్టాక్‌ మార్కెట్లు ఆర్‌బిఐ నిర్ణయంతో దిగజారాయి. సెన్సెక్స్‌156 పాయింట్లునష్టపోతే నిఫ్టీ 50సూచి 0.5శాతం దిగజారింది.

అయితే బ్యాంకింగ్‌రంగానికి కొంత ఉపశమనం కలిగించింది. ఆర్‌బిఐ ఇటీవల ప్రకటించిన ఇంక్రిమెంటల్‌ క్యాష్‌రిజర్వు రేషియోను ఉపసంహరించింది. డిపా జిట్‌లపై ఐసిఆర్‌ఆర్‌ 100శాతం కొనసాగించాలన్న తాత్కాలిక ఉత్తర్వులు వెనక్కి తీసుకుంది. నగదునిల్వల నిష్పత్తిపరంగాచూస్తే బ్యాంకు డిపాజిట్లు పరంగాచూస్తే 4శాతంగా ఆర్‌బిఐ కొనసాగి స్తుంది. అంతర్జాతీయంగా ముడిచమురుధరల పెరుగుదల సూచి స్తోందని, అలాగే మరికొన్ని కేటగిరీల్లో ద్రవ్యోల్బణం పెరిగే అవకా శం ఉన్నందువల్లనే రెపోరేట్లను యధాతథంగా కొనసాగించినట్లు పటేల్‌ వివరించారు. అయితే ద్రవ్యసర్దుబాటు సౌకర్యం (ఎల్‌ఎఎఫ్‌)ను మాత్రం యధాతథంగా 5.75శాతంవద్దనే కొన సాగించారు. ఇక ఎంఎస్‌ఎఫ్‌ రేట్‌ను కూడా 6.75శాతంగా కొన సాగించారు.

అలాగే కొన్ని కేటగిరీల ఉత్పత్తులపరంగా ఆహార ద్రవ్యోల్బణం కూడా పెరుగుతుందని పెద్దనోట్ల రద్దు ప్రభావం వల్ల చర ఉత్పత్తులు కొన్నింట తగ్గినా మరికొన్ని పెరుగుతాయని అంచనా వేసింది. నాలుగోత్రైమాసికంలో ద్రవ్యోల్బణం ఐదుశాతం గా ఉంటుందని కూడా ఆర్‌బిఐ అంచనావేసింది. హౌసింగ్‌, ఇంధ నం, కరెంటు, ఆరోగ్యం, రవాణా, కమ్యూనికేషన్‌; పాన్‌, పొగా కు, ఇతర మాదకద్రవ్యాల ఉత్పత్తులు విద్యపరంగా కూడా విని యోగరంగ ధరలసూచీలో 38శాతం వాటాతో ఉంటాయి. డిసెం బరు, ఫిబ్రవరినెలల్లో కొంత ప్రతికూల వాతావరణం ఉన్నందున ద్రవ్యోల్బణం పెరుగుతుందని అంచనావేసిన ఆర్‌బిఐ రెపోరేటును స్థిరంగా కొనసాగించింది.
ఇక అంతర్జాతీయగా చూస్తే అమెరికా ద్రవ్యవిధాన పరపతి సమీక్ష కొంత ఒత్తిడిపెంచుతుంది. దీనివల్ల ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఒపెక్‌ దేశాల ఇటీవలి సమావేశ నిర్ణయం వల్ల ముడిచమురుధరలు పెరిగి ఇంధన సూచీపై వత్తిడి తప్పదని అంచనావేసింది. అందువల్లనే రెపోరేట్లను యధాతథంగా కొనసాగించింది. బ్యాంకులకు రూ.11.5లక్షల కోట్ల డిపాజిట్లు పెద్దనోట్ల రద్దు తర్వాత నుంచి వాణిజ్యబ్యాంకులకు నవంబరు 8వ తేదీనుంచి నేటివరకూ సుమారు 11.5 లక్షలకోట్ల పాతనోట్లు డిపాజిట్లుగా వచ్చాయని ఆర్‌బిఐ గుర్తించింది. మొత్తంచెలామణి లో ఉన్న సోట్లు 15.44 లక్షల కోట్లు కాగా వాటిలో 11.5 లక్షల కోట్లు పాతనోట్లు డిపాజిట్‌ అయ్యాయని అంచనావేసింది.

డిసెం బరు 30వ తేదీవరకూ పాతనోట్లను డిపాజిట్‌ చేసుకునే అవకాశం ఉందని డిఫ్యూటీ గవర్నర్‌ ఆర్‌.గాంధీ వెల్లడించారు. అలాగే కొత్త నోట్లపరంగా ఇప్పటివరకూ నాలుగు లక్షలకోట్లు పంపిణీచేసామని వివరించారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయం అనాలోచితమని, అర్ధరహి తమని వస్తున్న విమర్శలను ఆయన ఖండించారు. పెద్దనోట్ల రద్దు తాత్కాలికంగా స్వల్పకాలికంగా కొంత ప్రభావం చూపిస్తుందని, నగదు ఆధారిత రంగాలైన రిటైల్‌, హోటల్‌, రెస్టారెంట్లు, ట్రాన్స్‌ పోర్టు రంగాలపై తీవ్రప్రభావం ఉంటుందని అంచనా వేసింది. సమగ్ర తర్జనభర్జనల తర్వాతనే పెద్దనోట్ల రద్దును నిర్ణయించా మని ఆర్‌బిఐ గవర్నర్‌ ఉర్జిత్‌పటేల్‌ మీడియాకు వివరించారు. అయితే వీటివల్ల ఎదురయ్యే చిక్కులను సాధ్యమైనంతగా తగ్గిం చేందుకు కృషిచేస్తున్నట్లు వివరించారు.

ఈ పెద్దనోట్ల రద్దుకారణం గా ద్రవ్యోల్బణంలో 10నుంచి 15 బేసిస్‌ పాయింట్లు మూడో త్రైమాసికంలో తగ్గుతాయని డిఫ్యూటీ గవర్నర్‌ ఆర్‌.గాంధీ వివరిం చారు. మొత్తంమీద ఆర్థికవ్యవస్థలో చెలామణిలో ఉన్న రూ.15.5 లక్షల కోట్ల విలువైన రూ.500, రూ.1000 నోట్లను ఉపసంహ రించడం వల్ల స్వల్పకాలికంగా మాత్రమే సమస్యలు ఎదురవు తాయని ఆర్‌బిఐ గరవ్నర్‌ భరోసా కల్పించే యత్నం చేసారు.