కార్పొరేట్‌లో తగ్గుతున్న ‘షేర్‌ తనఖా హోల్డింగ్‌

BSE
BSE

కార్పొరేట్‌లో తగ్గుతున్న ‘షేర్‌ తనఖా హోల్డింగ్‌

ముంబై: ఆర్ధ్థికవ్యవస్థలోని సమస్యాత్మకరంగాల్లో క్రమేపీ రికవరీతోపాటు వృద్ధిదిశగా వెళుతుండటంతో మౌలికవనరుల రం గాలు, విద్యుత్‌ ఉత్పత్తిరంగాల్లోని కంపెనీలు తమ షేర్లను కుదువ పెట్టి రుణపరపతిపెట్టడం ఇటీవలికాలంలో బాగాతగ్గింది. బిఎస్‌ఇ 500 జాబితాపరంగాచూస్తే 107 కంపెనీలు తమ తనఖా షేర్లను తగ్గించారు. గత ఏడాది ఏప్రిల్‌ నాటికి భారీగా తగ్గింపుకనిపిం చింది. వీటిలో 46 కంపెనీలైతే అసలు తనఖాషేర్లను మొత్తం విడిపించి వెనక్కి తీసుకున్నారు. కేపిటలైన్‌ రూపొందించిన అంచ నాల ప్రకారంచూస్తే 46 కంపెనీలు తమ తనఖా హోల్డింగ్‌ను పూర్తిగా వెనక్కి తీసుకున్నట్లు అంచనా. మొత్తం 178 కంపెనీలు బిఎస్‌ఇ 500 జాబితాలో ఉన్నవి గత ఏడాది నాలుగోత్రైమాసికం నుంచి తమ షేర్లను తనఖాపెట్టి పరపతి పొందాయి. రిలయన్స్‌ డిఫెన్స్‌, యూనిటెక్‌, టాటాగ్లోబల్‌ బేవరేజెస్‌, జిఎంఆర్‌ ఇన్‌ఫ్రా వంటి పెద్ద కంపెనీలు తమతమ తనఖా హోల్డింగ్‌్‌స ఈ రకంగానే తగ్గించాయి. ఇతరత్రా ఇండియా సిమెంట్స్‌, టాటా కమ్యూని కేషన్స్‌, అమర్‌రాజా బ్యాటరీస్‌, సెంచురీ ప్లైవుడ్‌ వంటి కంపెనీ లు తమ తనఖా హోల్డింగ్‌ ను పూర్తిగా తగ్గించుకోగలి గాయి. స్టాక్‌మార్కెట్లలో ఈ కంపెనీల షేర్ల కదలికలే ఇందుకుకీలకం అయ్యాయి. తనఖా పెట్టి న కంపెనీల్లోని షేర్లు పెరగడం లేదా తగ్గడం వంటి వాటి ఆధా రంగా ప్రమోటర్లు మొత్తం తనఖా షేర్లను తగ్గించుకున్నారు. కంపెనీ పదిరూపాయలు విలువకలిగిన పదిషేర్లను తనఖా పెడితే మొత్తం విలువ 100గా పరిగణిస్తారు. ఈ షేర్లు రూ.20 చొప్పు న ర్యాలీతీస్తే తనఖా విలువలు మొత్తం 200 అవుతుంది. ఇదే తరుణంలో ఐదుషేర్ల విలువ రూ100గా పరిగణనలోనికి తీసుకుం టారు. ప్రస్తుత మార్కెట్‌ ర్యాలీప్రకారంచూస్తే బిఎస్‌ఇ లిస్టెడ్‌ కంపెనీల్లో ఎక్కువ కనిపిస్తోంది. సెన్సెక్స్‌ జీవనకాల గరిష్ట స్థాయికి చేరినస్థాయికంటే 15శాతం ఎక్కువ లాభపడినట్లు సెన్సెక్స్‌ గణాంకాలు చెపుతున్నాయని ఈక్వినామిక్స్‌ వ్యవస్థాపకు లు జి.చొక్కలింగం వెల్లడించారు. కొన్ని కార్పొరేట్‌ కంపెనీల్లో ఉన్న ఫలితాలు కూడా కొంత మద్దతునిచ్చాయి. జైన్‌ ఇరిగేషన్‌ ప్రమోటర్లు తమ తనఖామొత్తం 21.4 శాతంనుంచి 6.6శాతానికి తగ్గించుకోగలిగాయి. నికరలాభాల్లో జైన్‌ ఇరిగేషన్‌ 129శాతం పెరిగింది. అదేస్థాయిలో జిఎంఆర్‌ ఇన్‌ఫ్రా కూడా తనతనఖా షేర్ల ను 46.9శాతం నుంచి 11శాతానికి తగ్గించుకోగలిగింది. స్థూల ఆర్థిక గణాంకాలు పెరగడం, సమస్యాత్మకరంగాల్లో వృద్ధి పురోగ మించడం వంటివి కంపెనీల రుణభారాన్ని తగ్గిస్తున్నాయి. మార్కె ట్‌ నిపుణుల అంచనాలను చూస్తే మెటల్‌ కంపెనీలకు మంచిరోజులున్నాయి. మౌలిక వనరులరంగంపై ప్రభుత్వ వ్యయం పెరి గితే ఈ కంపెనీలకు మరింత కలిసొస్తుం ది. రియల్‌ ఎస్టేట్‌, ఇన్‌ఫ్రా కంపెనీలకు మంచి రోజులొస్తాయని అంచనా. కొన్ని కంపెనీల్లో అయితే తనఖా హోల్డింగ్‌ పెరు గుతోంది. రిలయన్స్‌ఆడాల్‌గ్రూప్‌, రిలయ న్స్‌ పవర్‌, రిలయన్స్‌ ఇన్‌ఫ్రా, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ సంస్థల్లో తనఖాహోల్డింగ్‌ పెరిగింది.రిలయన్స్‌పవర్‌లో 48.3శాతం షేర్లు తనఖాలో ఉన్నాయి. గడచిన ఎని మిది త్రైమాసికాలుగా ఇదేతీరులో ఉంది. రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌లో అయితే మూడురెట్లు ఎక్కువ షేర్లు తనఖాలో ఉం చింది. జిందాల్‌ స్టీల్‌ 17శాతం, బజాజ్‌ కార్పొరేషన్‌ 33.5శాతం తనఖాహోల్డింగ్‌ను పెంచుకున్నట్లు తెలు స్తోంది. అయితే ఇన్‌ఫ్రారంగంలో కదలిక ఈకంపెనీల రుణభారం తగ్గించుకునేందుకు దోహదం చేస్తుందని మాత్రం చెప్పవచ్చు.