కార్పొరేట్స్‌లో సిఇఒలకు గడ్డుకాలం

corporate ceo's
corporate ceo’s

2018లో పలువురి నిష్క్రమణం
న్యూడిల్లీ: భారత్‌కార్పొరేట్‌రంగంలో 2018 సంవత్సరం పలువురు ప్రముఖులనిష్క్రమణకు సైతం వేదిక అయింది. అత్యున్నతస్థాయిపదవుల్లో కొనసాగుతున్నప్రముఖులు వివాదాలనేపథ్యంలో పోస్టులను వదులుకోవాల్సి వచ్చింది. వీరిస్థానంలో కొత్తవారిని నియమించుకోవడం కూడా భారత్‌కార్పొరేట్‌ రంగానికి కష్టమేనని తేలింది. ఐసిఐసిఐబ్యాంకు ఎండి సిఇఒ చందాకొచ్చర్‌ క్విడ్‌ప్రోకో పరంగా వైదొలిగితే ఐఎల్‌ఎప్‌ఎస్‌ వైస్‌ఛైర్మన్‌ హరిశంకరన్‌ మొత్తం బోర్డును ప్రభుత్వం రద్దుచేసింది. కంపెనీ వడ్డీ, ప్రిన్సిసల్‌మొత్తం 91000 కోట్లను చెల్లించడంలో విఫలం అయిందన్న అంచనాలే ఇందుకుకీలకం. ఇండిగో విమానయాన సంస్థనుంచి ఆదిత్యఘోష్‌ కూడా వైదొలగాల్సి వచ్చింది. అలాగే ఎస్‌బ్యాంకు ఎండి సిఇఒ రాణాకపూర్‌కు రిజర్వుబ్యాంకు పదవీకాలం పొడిగింపునకు అనుమతించకపోవడం కూడా ఆయన వైదొలగడానికి కారణం అయింది. 2019 జనవరి 31వ తేదీతో ఆయన పదవీకాలం ముగుస్తున్నది. ఇక ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ ఛైర్మన్‌ మాల్విందర్‌ మోహన్‌సింగ్‌, నాన్‌ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ శివిందర్‌మోహన్‌సింగ్‌లు తమతమ పదవులను వదులుకోవాలిస వచ్చింది. ఢిల్లీ హైకోర్టు అంతర్జాతీయ మధ్యవర్తిత్వ ట్రిబ్యునల్‌ 3500 కోట్ల అవార్డును జపాన్‌ ఫార్మామేజర్‌ డైయిచీ శాంక్యోకు అనుకూలంగా వెల్లడించడమే ఇందుకుకీలకం. అలాగే ఫ్లిప్‌కార్ట్‌ గ్రూప్‌ సిఇఒ సహవ్యవస్ళాపకుడు బిన్నీ బన్సాల్‌ కూడా వ్యక్తిగత అనైతిక ప్రవర్తనకారనంగా కంపెనీనుంచి వైదొలిగేందుకు నోటీసులు అందుకున్నారు. ఫ్లిప్‌కార్ట్‌ కొనుగోలుచేసిన వెంటనే అమెరికన్‌ దిగ్గజం వాల్‌మార్ట్‌ బిన్నీ బన్సాల్‌ తీవ్రస్థాయి ఆరోపణలు ఉన్నట్లు తమకు చెప్పలేదని వాదించింది. వాల్‌మార్ట్‌ ఆరోపణలను బిన్నీ వ్యతిరేకించినా నవంబరులో వైదొలగాల్సి వచ్చింది. మేనెలలో సహవ్యవస్థాపకుడు మాజీ సిఇఒ సచిన్‌బన్సాల్‌ వైదొలిగారు. ఐసిఐసిఐబ్యాంకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ బిఎన్‌ శ్రీకృష్ణను నియమించి కొచ్చర్‌పైవచ్చిన ఫిర్యాదులను విచారించాలనికోరింది. అయితే దర్యాప్తు సంస్థలు ఐఎల్‌ఎప్‌ఎస్‌ ఇతర అధికారులపై దర్యాప్తును ముమ్మరంచేసాయి. హెడ్‌హంటర్స్‌ హ్మూన్‌ రిసోర్సెస్‌ హెచ్‌ఆర్‌మేనేజర్స్‌ సంస్థ మాట్లాడుతూ మీటూ కేసులవల్ల కొంత కార్పొరేట్‌ రంగానికి ఇబ్బంది వచ్చిందని, దీనివల్ల కొందరు సిఇఒలు ఎక్కువగా చిన్నకంపెనీల్లో ఉన్నవారు వైదొలగాల్సి వచ్చిందని అన్నారు. సామాజిక మీడియా ఒత్తిడితోనే సిఇఒల మనుగడ మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రైవేటు బ్యాంకుల్లో సిఇఒల నిష్క్రమణం ఆసక్తికరంగా ఉంది. కొచ్చర్‌స్థానంలో సందీప్‌బక్షి వచ్చారు. యాక్సిస్‌ బ్యాంకు అమితాబ్‌చౌదరిని నియమించింది. ఆర్‌బిఐ కపూర్‌ తర్వాత మరొకరిని బ్యాంకు సిఇఒగా నియమించాలనిఎస్‌బ్యాంకుకు సూచించింది. వీరందరి స్థానాల్లో కొత్తవారిని నియమించడం భారతీయ కార్పొరేట్‌రంగానికి సవాళ్లతోకూడుకున్నదే.