కారుణ్య మ‌ర‌ణాన్ని కోరుతున్న క‌ర్ష‌కులు

B N
B N

ముంబై: మహారాష్ట్రలో కొందరు రైతన్నలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమ కష్టాలు తీర్చలేదని, ఇక తమకు కారుణ్య మరణానికి అనుమతివ్వాలని ఆ రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర రావు ను రైతులు కోరారు. ఈ మేరకు గవర్నర్ విద్యాసాగరరావుకు బుల్దానా ప్రాంతానికి చెందిన రైతులు 91 మంది సంతకాలతో కూడిన లేఖను రాశారు. తాము పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఓ రహదారి నిర్మాణానికి ప్రభుత్వం తమ భూములను సేకరించిందని, ఆ భూములకు తగిన పరిహారాన్ని సక్రమంగా అందజేయడం లేదని గవర్నర్‌ కు ఫిర్యాదు చేశారు. దీంతో గవర్నర్‌ విద్యాసాగర్‌ రావు రైతుల సమస్యలు పరిష్కరించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు.