కారణ జన్ములకే కైవల్య పదవి

Lord Budha
Lord Budha

కారణ జన్ములకే కైవల్య పదవి

బుద్దం శరణం గడ్ఛామి: ధ్యాన యోగంలో సిద్ధిని పొంది జన్యరాహిత్యమందిన సదానందుడు బుద్ధ భగవానుడు. మాయాదేవి, శుద్ధోధనుల ప్ఞత్రరత్నమతడు. మానవ జీవిత అవస్థలు వరుసగా ఒకే సమయంలో తిలకించి జీవితం క్షణభంగురం. కష్ట దుఃఖాల చక్రమయం అనే నిత్య సత్యాన్ని గ్రహించి, తన భార్యాబిడ్డలను సైతం త్యజించి, ఆనందమయ జీవితాన్ని అభిలషించి, అర్ధరాత్రి సమయంలో బయలువెడలి, గయ అను చోట నిశ్చల ప్రదేశంలో రావిచెట్టు క్రింద ధ్యాన ప్రక్రియను సాగించి కృతకృత్యుడై జాన్ఞనేత్రాన్ని సాధించిన రాజ ఋషి బుద్ధుడు.

తన లక్ష్య సిద్ధికి సంకేత నామము నెన్నుకున్నాడు. అదే బౌద్ధమతము. అందలి అంశాలలో జంతుబలి నిషేధం ముఖ్యాంశం. ఆదికాలం నుండి యజ్ఞ యాగాదుల సమయంలో గోవధ చేసి గోమాంసాన్ని యజ్ఞ దేవతకు సమర్పించేవారు. అది ఆనాదిగా వచ్చిన హిందూధర్మ సంప్రదాయంగా భావించేవారు. అవి లోకరక్షణార్థం చేసే కృత్యాలుగా తలంచేవారు. స్వార్థంకోసం కాదు కనుక దైవార్పితంగా విశ్వసించేవారు. కానీ జంతుబలిని ముఖ్యంగా భావించి ప్రపంచమంతా పర్యటించి ఆ కార్యాలకు నిషేధించినాడు. దాని ప్రగతికి కంకణం కట్టినాడు. అన్నిచోట్ల ఆ ఆచారాన్ని అనుసరించుటకు శ్రీకారం చుట్టినాడు. జీవ కారుణ్యమే తనకు దైవారాధనతో సమానం. సాటి ప్రాణికోటి సౌఖ్యమే స్వర్గదామంగా తలంచినాడు. బుద్ధమూర్తి. ఇందులకు ఒక చిన్నకథను తెలుసుకుందాం. ఒక పవిత్ర సన్నివేశాన్ని మనం అవగతం చేసుకుందాం. ఒకనాడు బుద్ధుడు తన స్నేహితుడగు దేవదత్తునితో కలిసి వాహ్యాళికి వెళ్ళినాడు. అదే సమయంలో ఆకాశంలో హంసలగుంప్ఞ సంచరిస్తూ ఉంటుంది.

దేవదత్తుడు నిర్దాక్షిణ్యంగా తన బాణంతో ఒక హంసను కొడతాడు. ఆ మృదులహంస నేలపై బడి విల విల తన్నుకొంటూ ఉంటుంది. దయార్ధ్ర హృదయుడగు బుద్ధుడు తన కారుణ్య నేత్రాలతో కాంచినాడు. వెంటనే తన హస్తాంచలములతో దానిని స్వీకరించి గాయమును నీటితో కడిగి వీప్ఞపై తట్టి ధైర్యమును ప్ఞరికొల్పి సేదతీర్చాడు. అంచతల్లి అసువ్ఞలను పొట్టన పెట్టుకోదలిచిన తన స్నేహితుని మందలించి జీవకారుణ్య ప్రాధాన్యతను తెలియజేస్తాడు. అంతేగాక హంస అనుభవించిన బాధను తాను కూడా అనుభవిస్తాడు. ఆ బాధ తనదిగా భావిస్తాడు. బుద్ధ భగవానుడు ప్రాణికోటి హింసను అరికట్టుటకు చేసిన ప్రయత్నం, పడిన శ్రమ అనిర్వచనీయం, అసాధారణ జ్ఞానియగు బుద్ధుడు చేసిన సేవలు అమరం కూడా ఆ ఆత్మస్వరూప్ఞడు అవని జనుల అజ్ఞానాందకారాన్ని రూప్ఞ మాప్ఞటకు చేసిన కృషి అమృతమయము. సంసారం దుఃఖమయమని, అందులకు కారణం కోరికలే అని, అదుప్ఞలో పెట్టుకుంటే దు:ఖమునకు తావుండదని పదేపదే చెప్పిన ప్రజ్ఞాశాలి.