కామ‌న్ వెల్త్‌లో ఫ్లాగ్ బియ‌ర‌ర్‌గా సింధు

PV SINDHU
PV SINDHU

న్యూఢిల్లీః హైదరాబాద్ షట్లర్ పీవీ సింధు.. గోల్డ్ కోస్ట్‌లో జరిగే కామన్‌వెల్త్ క్రీడల్లో భారత టీమ్‌కు ఫ్లాగ్ బియరర్‌గా వ్యవహరించనున్నది. భారతీయ అథ్లెట్ల బృందానికి ఆమె నాయకత్వం వహిస్తారు. గోల్డ్ కోస్ట్ ఓపెనింగ్ సెర్మనీలో సింధు.. త్రివర్ణ పతకంతో మార్చ్‌ఫాస్ట్‌లో పాల్గొనున్నది. రియో ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ గెలిచిన సింధుకు ఈ అరుదైన ఘనత దక్కింది. భారతీయ బృందంలో సైనా, మేరి కోమ్‌లు ఉన్నా.. సింధును ఫ్లాగ్ బియరర్‌గా ఎన్నుకోవడం విశేషం. ఏప్రిల్ 4వ తేదీన కామన్‌వెల్త్ క్రీడల ఓపెనింగ్ వేడుక జరగనున్నది.