కాపు రిజర్వేషన్లపై ప్రజల్లో గందరగోళం

KAPU JAC
KAPU JAC

విజయవాడ: ఏపి సియం చంద్రబాబు, వైఎస్‌ఆర్‌సిపి అధ్యక్షుడు జగన్మోహన్‌ రెడ్డి కాపులను ఓటు బ్యాంకుగానే చూస్తున్నారని కాపు జేఏసి చైర్మన్‌ సత్యనారాయణ విమర్శించారు. కాపు రిజర్వేషన్లపై ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని విమర్శించారు. ద్వంద్వ వైఖరితో జగన్‌ గత ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించారని.., కాపు రిజర్వేషన్లు సాధ్యం కాదన్న వాళ్లు తమతో చర్చకు రావాలని ఆయన సవాల్‌ విసిరారు. కాపు రిజర్వేషన్లపై యూ టర్న్‌ కాకుండా రైట్‌ టర్న్‌ తీసుకోవాలన్నారు. ఈ నెల 24 లోపు చంద్రబాబు స్పష్టమైన వైఖరి ప్రకటించాలని కాపు జేఏసి చైర్మన్‌ సత్యనారాయణ డిమాండ్‌ చేశారు.