కానుక

lassi1
– ఇంగువను చూర్ణం చేసి కొద్దిగా పొడిని మజ్జిగలో వేసుకుని రోజూ సేవిస్తూ ఉంటే గ్యాస్‌ సమస్య నివారణ అవుతుంది.
– ఉసిరి చూర్ణంలో బెల్లంతో కలిపి ముఖానికి ఫేస్‌మాస్క్‌ చేసుకుంటూ…ఉంటే ముఖంపై మచ్చలు తగ్గిపోతాయి.
– మద్దిపట్ల గంధము వలె మెత్తగా నూరి ముఖానికి రాస్తే మొటిమలు, మచ్చలు ముడతలు పోయి ముఖం అందంగా మారుతుంది.
– ఉమ్మెత్తాకు రసాన్ని మజ్జిగలో కలిపి వాడుతూ చప్పిడి పత్యము చేస్తే కామెర్లు త్వరగా తగ్గుతాయి.
– ఒక పెద్ద స్పూన్‌ తులసి రసం ప్రతిరోజూ తాగితే రక్తం శుభ్రపడటమే గాక గొంతు ఇన్‌ఫెక్షన్‌, కడుపునొప్పి తగ్గుతుంది.
– తులసి ఆకులు మెత్తగా నూరి శరీరానికి రాసుకుని 15నిముషాలు తరువాత గోరువెచ్చని నీటితో కడిగితే చర్మవ్యాధులు నయమవుతాయి.
– తులసి ఆకు రసం, నిమ్మ రసం కలిపి రాసుకుంటే తామర వ్యాధి త్వరగా తగ్గుతుంది.
– కరెంటు పోయినప్పుడు ఎక్కువ వెలుగు కావాలంటే వెడల్పయిన గిన్నెలో కొవ్వొత్తిని అంటించి నిలబెట్టిన తర్వాత నీళ్లు పోయండి. ఆ గిన్నెను అద్దం దగ్గర ఉంచితే వెలుగు బాగా వస్తుంది.
– వెన్న కాచేటప్పుడు తాజా బంగాళాదుంప ముక్క కొంచెం కరివేపాకు వేస్తే నెయ్యి సువా సనాభరితంగా ఉంటుంది.