కానుక

                              కానుక

KITCHEN TIPS
KITCHEN TIPS

్జ బంగాళాదుంపల ముక్కలతో చిప్స్‌ చేసేప్పుడు ముక్కలను ఉప్పు, చిటికెడు పసుపు కలిపిన నీటిలో కొద్దిసేపు నాననిచ్చి పొడి టవల్‌తో అద్ది వేయించండి. అప్పుడు ఆ చిప్స్‌ బంగారు రంగులో కరకరలాడుతూ ఉంటాయి.
్జ చిప్స్‌,పూరీల్లాంటివి వేయిస్తే అవి కరకరలాడేలా ఉండాలంటే న్యూస్‌పేపర్‌ ఉంచిన బేసిన్‌లాంటి పాత్రలో వాటిని వేయాలి. పేపర్‌ ఎక్కువగా ఉండే నూనెని పీల్చుకుని మెత్తగా అవకుండా చేస్తుంది.
్జ ఇడ్లీలు మెత్తగా రావాలంటే రవ్వ తక్కువ, మినపప్పు ఎక్కువ వేసి కలిపి వండాలి. ఎంత మెత్తగా రుబ్బితే ఇడ్లీ అంత మృదువ్ఞగా వస్తుంది.
్జ నిమ్మకాయ పిండక మునుపు పావ్ఞగంట సేపు వేణ్ణీళ్లలో ఉంచితే రసం ఎక్కువ వస్తుంది.
్జ కాలీఫ్లవర్‌ ఉడికేటప్పుడు కొద్దిగా పాలు కలిపితే కూర తెల్లగా రావడమే కాక కమ్మటి వాసన వస్తుంది.
్జ ఉల్లిపాయ త్వరగా ఉడకాలంటే చిటికెడు పంచదార నీళ్లలో వేయాలి.
్జ నీరు మరిగాక అందులో ఇన్‌స్టంట్‌ కాఫీపొడి కలపాలి. తిరిగి నీరు సలసలా మరిగేదాకా అంటే బుడగలు వచ్చేదాకా ఆగి స్టవ్‌ ఆర్పాలి. రెండు నిముషాల తర్వాత ఆ కాఫీని బ్లాక్‌ కాఫీ ఇష్టపడేవారికిస్తే రుచిగా ఉంటుంది.
్జ గ్యాస్‌స్టవ్‌ మీద పాలు కాస్తుంటే, ఆ గిన్నె దింపేదాకా ఇంకే పనిమీద వెళ్లకూడదు. మరపు మనిషి సహజం కాబట్టి పాలు పొంగి మంట ఆరి గ్యాస్‌ ఇల్లంతా అలుముకునే ప్రమాదం అధికం. చపాతీలు మెత్తగా కావాలనుకునే వారికి చపాతి పిండిని బియ్యపు పిండిలో దొర్లిస్తే చాలు.