కానుక

                                   కానుక

KITCHEN TIPS
KITCHEN TIPS

ల ఇరవై నుండి ముప్పది నల్లమిరియాలను తీసుకుని వాటిని పొడిచేసి అరకప్పు పాలలో కలిపి తలకు మర్దన చేయండి. రాత్రంతా అలాగే ఉంచి మర్నాడు షాంపూతో శుభ్రం చేసుకోండి. ఇలా ముప్పది రోజులు చేస్తే చుండ్రు త్వరగా తగ్గుతుంది.
ల పెరుగును వెంట్రుకలకు పట్టించడం వల్ల తలలో చుండ్రుపోవటమే గాక వెంట్రుకలు మృదువ్ఞగా మెరుస్తాయి. ఫ్రిజ్‌లో పెరుగు మాత్రం రాసుకోకూడదు.
ల శీతాకాలంలో చాలామందికి ఒళ్లు పగలడం, చర్మం బిరుసెక్కడం జరుగుతుంది. అలా కాకుండా ఉండాలంటే ప్రతీరోజూ గోరువెచ్చని నీటితో స్నానం చేయటానికి ముందు కొద్దిగా వెన్నగాని లేకపోతే మంచి కొబ్బరినూనెగాని శరీరానికి పట్టించుకుని ఓ పదినిమిషాలు అలాగే ఉండి తరువాత సున్నిపిండి రుద్దుకుని స్నానం చేస్తే చర్మం మృదువ్ఞగా కాంతివంతంగా ఉంటుంది.
ల ఈ కాలంలో కొందరికి నోటికి ఇరువైపులా చర్మం పగిలి, ముడతలు పడి అసహ్యంగా ఉంటుంది. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం రెండువేళలా కొద్దిగా వెన్న లేక నెయ్యి ముఖానికి రాసి నెమ్మదిగా వత్తుతూ మర్దించి కొంతసేపయ్యాక సున్నిపిండితో స్నానం చేస్తుంటే క్రమేణా పగుళ్లు తగ్గుతాయి. అరస్పూన్‌ శొంఠిపొడిని ఒక కప్పు ఆవ్ఞపాలలో కలిపి బాగా ఉడికించి చల్లారిన తర్వాత తాగితే కామెర్లు తగ్గుముఖం పడతాయి.
ల కంది ఆకుల రసానికి కొద్దిగా ఉప్పు కలుపుకుని ఒక పావ్ఞ కప్పు చొప్పున ప్రతిరోజూ మూడు పూటలా తాగుతుంటే కామెర్లు తగ్గిపోతాయి.
ల ఒక కప్పు పాలల్లో ఒక పసుపుకొమ్మును ముక్కలుగా చితకగొట్టి వేసి ఆ పాలను బాగా మరగబెట్టి ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం కామెర్లు తగ్గేంత వరకూ రెండు పూటలా తాగుతుం డాలి. అలాగే మారేడు ఆకుల రసంలో మిరియాల పొడి కలుపుకుని తాగు తుంటే కామెర్లు త్వరగా తగ్గిపోతాయి.