కానుక

COOKING2
COOKING

కానుక

పాలకాయలు చేసేటప్పుడు పిండిని తేలికగా ఉండలు చేస్తే, నూనెలో వేయించేటప్పుడు పగలకుండా ఉంటాయి.

పాత్రలు దింపేందుకు వాడే పట్టకారు నల్లబడిపోతే, దాన్ని బియ్యం కడిగిన నీటిలో నానబెట్టి తోమాలి. ఇలా చేస్తే తెల్లగా అవు తుంది. నేలమీద తడిమట్టిని పరి చి, దానిమీద బంగాళదుంపలు పెడితే ఎక్కువ రోజులు చెడిపో కుండా ఉంటాయి.

టర్పెన్‌టైల్‌ ఆయిల్‌లో తడిపిన పత్తిని ఇంటిమూలల్లో, బీరువాల కిందా ఉంచితే ఎలుకలు రావ్ఞ. డర్టీగా, మాసిపోయిన ఎలక్ట్రిక్‌ స్విచ్చులను కిరోసిన్‌లో ముంచిన కాటన్‌తో తుడవండి.

ఉసిరిపొడిని ఇనుపపాత్రలో రాత్రిపూట నానవేసి ఉదయాన్నే ఆ మిశ్రమాన్ని బ్రష్‌తో వెంట్రుకలకు పట్టించి, అనంతరం తలకు పవర్‌ క్యాప్‌ పెట్టుకుని గంట తరువాత స్నానం చేస్తే పెరుగుతుంది.

చేతికి రానంత చిన్నవై పోయిన టా§్‌ులెట్‌ సోపు ముక్కలు ఎండబెట్టి తరిమి సర్ఫ్‌ వంటి పౌడర్‌లలో కలిపి బట్టలు ఉతికితే మంచి సువాసనను వెదజల్లుతాయి.