కానుక

vegitables
vegitables

కానుక

వేవిళ్లున్న వారు వికారం, కడుపులో త్రిప్పుటలాంటివి ఉన్నవారు శొంఠి లేదా అల్లము ఉప్పు మెత్తగా నూరి తేనెతో తినండి. వికారము తలత్రిప్పుట జరగదు.

చేదుగా ఉన్న కూరగాయలు పారవేయకుండా ఉప్పేసి ఉడకబ్టెండి. మామూలుగా తయారవుతాయి.

పచ్చిబొప్పాయిని ఎండబెట్టి ధనియాలు, మిరియాలు పొడులుగా చేసి ఉప్పు చల్లి కొద్దిగా నిమ్మరసం పిండి తీసుకుంటే జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. మలబద్దకం వదులుతుంది.

కాకరకాయలను ముక్కలుగా కోసి నిమ్మరసముతో ఒకరోజు నానబెట్టి ఎండబెట్టాలి. వీటి ఎండాక డబ్బాలో నిల్వచేసుకుని కావలసినపుడు నూనెలో వేయించుకుని తినవచ్చు.

పిప్పళ్లు, శొంఠి, మిరియాలు ఈ మూడింటినీ కలిపి చూర్ణం చేసుకుని కొద్దిగా బెల్లం కలిపి కందిగింజంత మాత్రలు వేసి రోజూ మూడుపూటలా తీసుకుంటుంటే దగ్గు త్వరగా తగ్గిపోతుంది.

తులసి ఆకుల రసంలో కొద్దిగా కర్పూరం కలిపి శరరంపై గల తెల్ల మచ్చలకు రాస్తే అవి క్రమేణా తగ్గుతాయి.

మునగ చెట్టు బెరడును గంధంగా తీసి అరికాళ్ల మీద రోజుకు మూడుపూటలా రాస్తుంటే అరికాళ్ల మంటలు తగ్గుతాయి.

ఉల్లిపాయ, ఆవాలు సమభాగాలుగా తీసుకుని బాగా నూరి వ్యాధిగా ఉన్న కీళ్ల మీద మర్దనా చేసుకుంటే వెంటనే నొప్పులు తగ్గుతాయి.