కానుక

fairness
– ఐదారు బీన్స్‌ తీసుకుని మెత్తగా గ్రైండ్‌ చేసుకుని దానికి కొంచెం పెరుగు కలిపి చర్మానికి రాసుకుని మర్దన చేయాలి. ఆరాక గోరువెచ్చని నీటితో కడిగితే చర్మం కోమలంగా తయారవుతుంది.

– గుప్పెడు గులాబీ రేఖలను బాగా కడిగి ఒక పాత్రలో వేసి నీళ్లు పోసి మరిగించాలి. చల్లారాక వడకట్టి ఓ సీసాలో పోసుకుని అవసరమైనప్పుడల్లా ఈ గులాబీ నీటిని ముఖానికి రాసుకుంటూ ఉంటే ముఖంపై పేరుకునే దుమ్ముధూళి పూర్తిగా తొలగిపోయి చర్మం తేటగా మారుతుంది. ఇది అన్నిరకాల చర్మతత్వం వారికి సరిపడుతుంది.

– చెంచా పెరుగుకు కాస్త బత్తాయి రసం చేర్చి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని వెడల్పాటి పళ్లెంలో పోసి అందులో ముంచి ఆ చేతులతో నెమ్మదిగా ముఖాన్ని మర్దనా చేసి ఐదు నిమిషాలయ్యాక కడిగెయ్యాలి. మృదువైన చర్మంతో పాటు మీ చేతులూ శుభ్రంగా అవుతాయి.

– కొంచెం వేపాకు మెత్తగా నూరి దానికి చందనం పొడి కలిపి మొటిమల మీద పూసి గంట తర్వాత స్నానం చేయండి. మొటిమలు పోతాయి. చందనం పొడి, కర్పూరం పొడి నీటిలో కలిపి పేస్టులా చేసి రాత్రి పూట రాసుకుని ఉదయమే కడుక్కుంటే మొటిమలు పోతాయి.