. కానీ ఒక్క దర్శకుడు మాత్రం చాలా కోపానికి గురి చేశాడట

Rakul Preet Singh Stills in Winner Movie
Rakul Preet Singh Stills in Winner Movie

. వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో హిట్ అందుకొని ఆ తర్వాత వరుసగా అవకాశాలను అందుకొని స్టార్ హీరోలతో సినిమాలను చేసి బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకుంది. ఇక ఆ తర్వాత మళ్లీ అపజయాలను అందుకొని వెంటనే మళ్లీ హిట్స్ అందుకుంది.

అయితే ఇప్పుడు మళ్లీ అమ్మడి పరిస్థితి కొంచెం క్రిటికల్ గానే ఉన్నా అనుభవం ఉండడంతో వచ్చిన అవకాశాలనే సద్వినియోగం చేసుకునేలా ప్లాన్స్ వేసుకుంటుందట. అయితే రకుల్ ఇప్పటివరకు చేసిన దర్శకులతో ఎటువంటి ఇబ్బంది రాలేదని చెప్పింది. కానీ ఒక్క దర్శకుడు మాత్రం ఆమెను చాలా కోపానికి గురి చేశాడని.. మానసికంగా వేధిస్తున్నాడని తెలుస్తోంది. ఇంతకుముందు ఆమెతో వర్క్ చేసిన ఒక దర్శకుడు ఈమధ్యనే రకుల్ దగ్గరికికి వచ్చి ఒక లేడి ఓరియెంటెడ్ కథ చెప్పాడట. కానీ రకుల్ కు కథ నచ్చలేక ఒప్పుకోలేదు.

దీంతో ఆ దర్శకుడు ఎలాగైనా సినిమా ఒకే చేయించాలని చాలా ప్రయత్నించాడు. వేధించాడు కూడా అయితే గట్టిగా ఒకసారి వార్నింగ్ ఇస్తే కాని మనోడు తన ప్రయత్నాలు మానుకోలేదట.

మొత్తానికి స్టార్ హీరోయిన్లకు తొలుత అవకాశాలు ఇచ్చిన దర్శకుల నుండి ఇలాంటి తిప్పలు తప్పవనమాట. రకుల్ విషయం చూస్తే అది మనం అర్దంచేసుకోవచ్చు.