కాటమరాయుడు మరదలు ఈ చిన్నదే!

MANASAFFF
Actress Manasa Hima Varsha

కాటమరాయుడు మరదలు ఈ చిన్నదే!

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ సినిమాలో చిన్న పాత్ర పోషించే అవకాశం వచ్చినా ఆయా ఆర్టిస్టులు ఎగిరిగంతేస్తారు. ఆ అవకాశం తమ కెరీర్‌ కి ఎంతగానో హెల్ప్‌ అవుతుందని భావిస్తారు. ఇప్పుడు అలాంటి అవకాశం యువ నటి మానస హిమవర్షను వెతుక్కుంటూ వచ్చింది. డాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కాటమరాయుడు సినిమాలో పవన్‌ కల్యాణ్‌ కు మరదలిగా ఈ చిన్నది ఫుల్‌ లెంత్‌ క్యారెక్టర్‌ చేస్తోంది.దీని గురించి ఆమె చెబుతూ, కాటమరాయుడులో పవన్‌ గారికి మరదలిగా నటిస్తున్నాను. పట్టులంగా, ఓణీ వేసుకుని పదహారణాల తెలుగమ్మాయిగా కనిపిస్తాను. సినిమాలో పవన్‌ ఇంట్లోనే ఉంటూ, సోదరులతో కలసి ఆయనని ఆటపట్టిస్తూ వుంటాను. ఈ అవకాశం నాకు దక్కినందుకు చాలా హ్యాపీగా వుంది అని చెప్పింది. కాగా, ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ హైదరాబాదులో జరుగుతోంది.