కాజల్‌కి జిలేబి…జిహ్వా చాపల్యం

Kajal News
Kajal agarwal

టాలీవుడ్‌ బ్యూటీ కాజల్‌ అగర్వాల్‌ ఓ ఆసక్తికర ఫోటో తన ఇన్‌స్టా గ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. ఓ స్వీట్‌ షాపులోకి వెళ్లిన కాజల్‌ అక్కడ జిలేబి చూసి నోరు తెరిచింది. ఆ జిలేబి అంతా తినేస్తానంటున్నట్లుగా నోరు తెరిచిన కాజల్‌ ఫోటోను అక్కడున్న వాళ్లెవరో తీశారు. ఈ ఫోటోను కాజల్‌ తన ఖాతాలో పోస్ట్‌ చేసింది. ఈ పోస్ట్‌పై నెటిజన్లు భిన్న వ్యాఖ్యలు చేశారు. కాగా, హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌ సరసన ఓ సినిమాలో కాజల్‌ నటిస్తోంది. కొత్త దర్శకుడు శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందిస్తున్నారు.