కాగ్నిజెంట్‌లో ఉద్యోగుల రాజీనామాలు

resignations
resignations

అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న, ఇండియాలో వేలాది మంది ఐటీ నిపుణులు పనిచేస్తున్న సంస్థ
కాగ్నిజెంట్‌ నుంచి గత మూడు నెలల కాలంలో 4400 మంది టెక్కీలు రాజీనామాలు చేసి
వెళుతున్నారు. సాధారణ స్థాయి కన్నా అట్రిషన్‌ లెవల్‌ ఎక్కువగా ఉందని ఉద్యోగులంతా
స్వచ్ఛందంగా రాజీనామాలు చేశారని కాగ్నిజెంట్‌ ఛీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ అన్నారు.
వీరి రాజీనామాలు తమ కంపెనీపై ఎటువంటి ప్రభావం చూపబోదని ఆయన అన్నారు.