కాకినాడ‌లో ముగిసిన పోలింగ్

kakinada polling
kakinada polling

కాకినాడ: కాకినాడ నగర పాలక ఎన్నికల్లో పోలింగ్‌ ప్రక్రియ ముగిసింది. చెదురు మ‌దురు ఘ‌ట‌న‌లు మినహా పోలింగ్‌
ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్‌ కేంద్రాల వద్ద క్యూ లైన్లలో ఉన్న ఓటర్లకు ఓటువేసే అవకాశం కల్పిస్తున్నట్టు ఎన్నికల
అధికారులు తెలిపారు. ఈ ఎన్నికల్లో మొత్తం 241 మంది అభ్యర్థులు బరిలో నిలవగా.. కాకినాడలో నగర కార్పొరేషన్‌
పరిధిలో 196 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. శివారు ప్రాంతాల్లోని ప్రజలు ఓటు వేసేందుకు ఆసక్తి ప్రదర్శించారు.
నగరంలోని మాత్రం కొంత మందకొడిగా ఓటింగ్‌ జరిగింది. ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు వారిని కదిలించేందుకు
తీవ్ర ప్రయత్నాలు చేశారు. సాయంత్రం 4 గంటల సమయానికి మొత్తం 60.43 శాతం పోలింగ్‌ నమోదైనట్టు అధికారులు
తెలిపారు.