కాంగ్రెస్ పాల‌న‌లో ప్ర‌గ‌తి జీరోః కెటిఆర్

KTR
KTR

హైద‌రాబాద్: 75 ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌ ప్రజల కోసం ఏమీ చేయలేదని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అన్నారు. కాగా,  నేడు భాగ్యనగర పరిధిలోగల తెలంగాణ భవన్‌లో మంత్రులు కేటీఆర్‌, పోచారం శ్రీనివాస్‌ సమక్షంలో బాన్సువాడ నియోజకవర్గ టీడీపీ నేత బజ్యా నాయక్‌ టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకున్నారు. అనంతరం కేటీఆర్‌ మాట్లాడుతూ.. చరిత్రలో ఎక్కడా లేని విధందగా అనేక కార్యక్రమాలను ప్ర‌వేశ‌పెట్టింది టీఆర్‌ఎస్‌ అన్నారు. అలాగే, సేవాలాల్‌ మహరాజ్‌ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్న ప్రభుత్వం కూడా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనన్నారు మంత్రి కేటీఆర్‌.