కాంగ్రెస్ నేత‌ల కొలువుల కోస‌మే ‘కొలువుల కొట్లాట’: కెటిఆర్

KTR
KTR

హైదరాబాద్: కొలువుల కొట్లాట స‌భ‌పై మంత్రి కెటిఆర్ తీవ్రంగా మ‌డ్డిప‌డ్డారు. కొలువ‌లు కొట్లాట పేరుతో శిఖండి రాజకీయాలు చేస్తున్నారని
కాంగ్రెస్ నేతల కొలువుల కోసమే కొట్లాట చేస్తున్నారని మండిపడ్డారు. గడిచిన మూడేళ్లలో 30వేల పైచిలుకు ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. మొత్తం లక్షా 12వేల ఉద్యోగాలు ఇచ్చి తీరుతామని కేటీఆర్ స్పష్టం చేశారు. భర్తీ చేయకుంటే తమని ఏం చేయాలో ప్రజలే నిర్ణయిస్తారన్నారు. ఉద్యోగం ఉన్నన్ని రోజులు బ్రహ్మాండంగా ఉద్యోగం చేసుకున్నారు. ఆయన ఏం త్యాగం చేశారు? అని ప్రశ్నించారు. ఉన్నన్ని రోజులు ఉద్యోగం చేసుకొని.. ఆ పదవి అయిపోగానే కొత్త కొలువు కోసం కొట్లాడుతున్నారని మండిపడ్డారు. కోదండరాం కండువా కప్పుకోని కాంగ్రెస్ కార్యకర్త అని.. పిల్లల భవిష్యత్‌ను అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.