కాంగ్రెస్ నేత‌లంతా బెయిల్‌పై బ‌య‌ట ఉన్నారు?:మోదీ

pm modi
pm modi

షిమ్లాఃమంగ‌ళ‌వారం హిమ‌చ‌ల్‌ ప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారాన్ని ప్ర‌ధాని మోదీ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో ఏఐసీసీ అధ్య‌క్షురాలు సోనియాగాంధీ, ఆమె కుమారుడు రాహుల్‌గాంధీ బెయిల్‌పై బయట ఉన్నారని ఆ రాష్ట్ర సీఎం  వీరభద్ర సింగ్‌ ప్రభుత్వం సైతం అవినీతి కేసులు ఎదుర్కుంటోంద‌ని మండిప‌డ్డారు. కాంగ్రెస్ నేత‌లంతా బెయిల్‌పై బ‌య‌ట ఉంటున్నార‌ని ఎద్దేవా చేశారు. కాగా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా బిలాస్ పూర్‌లో 750 పడకల ఎయిమ్స్‌ ఆస్పత్రికి మోదీ శంకుస్థాపన చేశారు.