కాంగ్రెస్ కండువా క‌ప్పుకున్న రేవంత్ టీం

Revanth reddy
Revanth reddy

న్యూఢిల్లీః కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు 18 మంది నేతలు కాంగ్రెస్ లో చేరారు. వీరందరినీ రాహుల్ గాంధీ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నవారిలో సీతక్క, వేం నరేందర్ రెడ్డి, విజయరమణారావు, అరికెల నర్సారెడ్డి, బోడ జనార్దన్, సోయం బాబురావు, జంగయ్య, బిల్యా నాయక్, రమేష్ రెడ్డి, మేడిపల్లి సత్యం, శశికళ, రాజారాం యాదవ్ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జ్ కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ నేతలు వి.హనుమంతరావు, చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కండువాతో రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా కనిపించారు.