కాంగ్రెస్ ఎమ్మెల్యేల పై టీఆర్‌ఎస్ మైండ్‌గేమ్

CONGRESS, TRS
CONGRESS, TRS

హైదరాబాద్: తాను టీఆర్ఎస్‌లో చేరబోతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని, అవి పూర్తిగా నిరాధారమైనవి, అవాస్తవమని కాంగ్రెస్ నేత, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అన్నారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని ఆయన స్పష్టం చేశారు. ఇతర పార్టీ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరనున్నారని టీఆర్‌ఎస్ మైండ్‌గేమ్ ఆడుతోందని విమర్శించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై దుష్ప్రచారాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు సుధీర్‌రెడ్డి పేర్కొన్నారు.