కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో 35 అంశాలు, 116 పేజీలు

congress
congress

116 పేజీలతో కాంగ్రెస్‌ మేనిఫెస్టో…35 అంశాలతో విడుదల
సమూల మార్పు కోసం సమగ్ర ప్రణాళిక అంటూ టాగ్‌లైన్‌
హైదరాబాద్‌: కాంగ్రెస్‌ మేనిఫెస్టోను విడుదల చేసింది. పీపుల్స్‌ మేనిఫెస్టో అంటూ కాంగ్రెస్‌ తన మేనిఫెస్టోను విడుదల చేశారు. 116 పేజీలతో 35 ప్రధాన అంశాలతో…సమూల మార్పు కోసం సమగ్ర ప్రణాళిక అంటూ టాగ్‌లైన్‌ పేరుతో విడుదల చేసింది. ఇందులో ప్రధాన అంశాలను పరిశీలిస్తే అందెశ్రీ గీతం జయజయ హై తెలంగాణ రాష్ట్ర గీతంగా అమలు. అమరవీరులకి జోహార్‌…జై శంకర్‌ జీ అమరహే (తెలంగాణ సిద్దాంత కర్త). నియంత పాలన కూల్చేదం, సామాజిక తెలంగాణ నియమిద్దాం సోనియా రుణం తీర్చుకుందాం అంటూ ముందుమాటలో మేనిఫెస్టోలో పేర్కొన్నారు. సుపరిపాలన సాగిదాం. సచివాలయం కేంద్రంగా పరిపాలన, పారదర్శక పాలన ఆర్‌టిఎ చట్టం పటిష్టంగా అమలు. సచివాలయంలో పీపుల్‌ గ్రివెన్స్‌ సెల్‌ ఏర్పాటు. అమరుల ఉద్యమ కారుల సంక్షేమం కోసం ప్రతి జిల్లాలో అమరుల స్థూపం. ఉద్యమ కారులపై కేసులు ఎత్తివేత. అమరవీరులకు రూ.10లక్షల ఆర్థిక సహాయం, ఉచిత బస్‌పాస్‌ డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు.
రైతులకు రూ.2లక్షల వరకు రుణ మాఫి, కో ఆపరేటీవ్‌ లోన్స్‌ వడ్డీ మాఫీ, రూ.5000కోట్లతో స్థిరీకరణ నిధి. 15 పంటలకు మద్దతు ధర కల్పన
యువతకు రూ.3000 నిరుద్యోగ భృతి, యేడాదిలో లక్షల ఉద్యోగాలు, 20వేల మెగా డిఎస్‌సీ, వార్షిక కేలండర్‌.
విద్యారంగంలో రెండు విడతల్లో ఫీజు రీయంబర్స్‌మెంట్‌ అమలు, ఆదాయంలో 20శాతం నిధులని విద్యా రంగం కోసం కేటాయింపు.
ఎస్సీ, ఎస్టీ ఆదివాసం కార్పోరేషన్‌ ఏర్పాటు
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ పటిష్ట అమలు, గిరిజన భూముల విక్రయాలపై 1970 పటిష్టంగా అమలు
సమ్మక్క సారక్క జాతర జాతీయ గిరిజన పండగా జరిపిద్దాం
మైనారీ సంక్షేమం కోసం సబ్‌ప్లాన్‌ ఏర్పాటుతో పాటు వర్క్ఫ్‌ బోర్డుకి జ్యూడిషనల్‌ అధికారులు, ఉర్థూని సెకండ్‌ లాంగ్వేజీ
బిసి వెనుబడిన తరగతుల కోసం బిసి సబ్‌ ప్లాన్‌ అమలు, కెసిఆర్‌ తొలగించిన 26కులాలను బసిలో చేర్చడం, ఆర్థికంగా వెనుబడిన కులాలను వెల్ఫేర్‌ బోర్డులులో ఏర్పాటు, స్థానిక సంస్థల్లో బిసిలకు జనాభా ప్రకారం రిజర్వేషన్‌లు.
మహిళలకు 10లక్షల వరకు వడ్డీలేని రుణం, రూ.లక్ష రూపాయల గ్రాంట్‌, ఆరు సిలిండర్లు ఉచితంగా అందివ్వడం.
అడ్వకేట్లకు రూ.300కోట్లతో సంక్షేమ నిధి
జర్నలిస్టులకి రూ.200కోట్లతో సంక్షేమ నిధి
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, హెల్త్‌ కార్డుల అమలు
నీటి పారుదల రంగంలో మార్పులు చేసి కాళేశ్వరం పెను మార్పులు చేసి తుమ్మిడి హట్టి నుంచి గ్రావిటీ ద్వారా నీళ్లు తీసుకుని వచ్చి కోటి ఎకరాలకు సాగు నీటిని అందిస్తాం
పారిశ్రామిక రంగాన్ని ఆదుకుంటాం. కొత్త పరిశ్రమలకు 50వేల ఎకరాలకు ల్యాండ్‌ బ్యాంక్‌ ఏర్పాటు చేస్తాం. పెట్టుబడుల ఆకర్షణకు 100శాతం రాయితీ.
ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు సిపిఎస్‌ విధానాన్ని రద్దు చేస్తామని, పాత పెన్షన్‌ విధానం అమలు. కొత్త పిఆర్‌సి అమలు చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి 60 సంవత్సరాలకు పెంపు, ఏపిలో పనిచేసే ఉద్యోగులను తెలంగాణాకు తిరిగి రప్పిస్తాం.
గల్ప్‌ కార్మికుల కోసం ఎన్‌ఆర్‌ఐ సంక్షేమానికి సంబంధించి 100 రోజుల ఎన్‌ఆర్‌ఐ పాలసీని అమలు చేస్తాం. రూ.500కోట్ల సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తాం. విదేశాలలో కార్మిక సమస్యలు తెలుసుకునేందుకు 24గంటల హెల్ఫ్‌లైన్‌ ఏర్పాటు చేస్తాం. గల్ప్‌లో మృతి చెందిన కుటుంబాలకు ఐదు లక్షల నష్టపరిహారం అందిస్తాం.
బాలల హక్కుల సంక్షేమ కోసం ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు 300-500 ఉపకార వేతనాలు ఇస్తాం. విద్యార్థి హక్కు చట్టం-బాల కార్మిక నిషేద చట్టం పటిష్ట అమలు చేస్తాం. బాలల హక్కుల పరిరక్షణకై స్టేట్‌ కమిషన్‌ ఏర్పాటు చేస్తాం. దివ్యాంగుల సంక్షేమం, అంధుల కోసం ప్రత్యేక చర్యలు, దూషించిన వారిపై అట్రాసిటీ కేసులు, ట్రాన్స్‌జెండర్‌లకు రూ.3000 పింఛన్‌, ఇందిరమ్మ ఇళ్లు, ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు రుణాలు.
సింగరేణి నియామకాల అవకతవకలపై విచారణ, అక్రమంగా తొలగించిన ఉద్యోగుల నియామకాలు. అర్హులైన కార్మికులకు ఇళ్ల స్థలాలు.
పంచాయితీరాజ్‌ చట్టం ప్రకారం 73,74 అధికరణ ప్రకారం స్థానిక సంస్థలకు అధికారాలు ఇస్తాం. గ్రామపంచాయితీ, డిఆర్‌డిఎ, నరేగా, సెర్ఫ్‌, కార్మిక ఉద్యోగుల క్రమబద్దీకరణ చేస్తాం.
జిహెచ్‌ఎంసికి సంబంధించి స్థాని ప్రభుత్వాల గుర్తించి అధికారాల బదలాయింపు, నిధుల కేటాయింపు, మురికివాడల అభివృద్ధి కోసం స్లమ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఏర్పాటు
షీ టీమ్స్‌ రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు, పోలీసులకు వీక్లీ ఆఫ్‌ ఇస్తాం. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అమలు, మూడు నుంచి ఆరు నెలలకి హెల్త్‌ చెకప్‌ చేయిస్తాం.
మధ్యపానం: వైన్‌ షాప్‌లని నిబంధనల ప్రకారం నియంత్రిస్తాం. బెల్ట్‌ షాప్‌లు, పర్మిట్‌ రూంలు కట్టడి చేస్తాం. నీరా ఆధారిత ఉత్పత్తులు ప్రోత్సహించి గీత కార్మిక ఉపాధి పెంచుతాం. గుడాంబ కల్తీ సారా, కల్తీ కల్లు, డ్రగ్స్‌తో పాటు గుడి, బడి, జన నివసాలకు దూరంగా వైన్స్‌షాప్‌లను ఏర్పాటు చేస్తాం.