కాంగ్రెస్‌ మళ్లీ గెలుస్తామనడం హాస్యాస్పదం: హరిబాబు

Kambampati Haribabu
Kambampati Haribabu

విజయవాడ: కాంగ్రెస్‌ మళ్లీ గెలిస్తే హోదా ఇస్తామనడం హోస్యాస్పదమని ఏపి బిజెపి అధ్యక్షుడు హరిబాబు విమర్శించారు. శుక్రవారం విజయవాడలో జరుగుతున్న ఆయన మాట్లాడుతూ అధికారంలో ఉన్నప్పుడు హాదాను చట్టంలో ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. తమ పార్టీ ప్రత్యేక హోదా ప్రకటించకున్నా..ప్రత్యేక నిధులు ఇచ్చామని ఆయన అన్నారు. హోదా ఉన్న 3 రాష్ట్రాలకు హొదా పొడిగించిందని నిరూపిస్తే ఏపికి ప్రత్యేక హోదా కోసం తాము డిమాండ్‌ చేస్తామని ఎంపి హరిబాబు స్పష్టం చేశారు.