కాంగ్రెస్‌ పార్టీని వీడుతున్న నేతలు

congress
congress

హైదరాబాద్‌: తెలంగాణలో కీలక స్థానాల్లో పోటీ చేసిన నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండటంతో కాంగ్రెస్‌కు ఎదురు దెబ్బ తగులుతుంది. వంటేరు టిఆర్‌ఎస్‌లోకి చేరిన విషయం తెలిసిందే. అయితే ఆర్మూర్‌, ఎమ్మెల్సీ ఆకుల లలిత కాంగ్రెస్‌ను వీడి టిఆర్‌ఎస్‌లో చేరారు. ఈ పరిస్థితుల్లో నేతలు పార్టీని వదిలి వెళ్లకుండా నిలువరించేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయాలో అర్థంకాక ముఖ్య నేతలు సతమతమవుతున్నారు. శాసనసభ నియోజకవర్గాలకు బాధ్యులుగా వ్యవహరించిన పలువురు పార్టీకి దూరం అవుతుండటం లోక్‌సభ ఎన్నికల్లో నష్టం కలిగిస్తుందని పేర్కొంటున్నారు.