కాంగ్రెస్‌ నేతలకు బీసీల కోసం మాట్లాడే అర్హత లేదు

 

Danam Nagender
Danam Nagender

హైదరాబాద్‌: తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓడినా నేతలకు ఇంకా బుద్ధి రాలేదని ఎమ్మెల్యె దానం నాగేందర్‌ వ్యాఖ్యానించారు. ఈరోజు మీడియాతో మాట్లాడుతు ఓటమికి గత కారణాలపై విశ్లేషించకుండా ఈవీఎంల సాకు చూపుతున్నారని ఆయన మండిపడ్డారు. ఓడిపోతే గాంధీభవన్‌కు రానన్న ఉత్తమ్‌ మాట నిలబెట్టుకోలేదన్నారు. కాంగ్రెస్‌ నేతలకు బీసీల గురించి మాట్లాడే అర్హత లేదని ఆయన అన్నారు. చంద్రబాబు జోలికి ఎవరు పోయారని..ఆయనే తమ జోలికి వచ్చారని తెలిపారు. ఫెడరల్ ఫ్రంట్‌పై క్లారిటీ లేదంటున్నారని..అయితే వారి ఫ్రంట్‌కు ఏమీ క్లారిటీ ఉందో చెప్పాలని దానం నాగేందర్ డిమాండ్ చేశారు.