కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సభ్యత్వ రద్దుపై మరో పిటిషన్‌

ts high court
ts high court

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దుపై సింగిల్‌ బెంచ్‌ తీర్పును సవాల్‌ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం మరో పిటిషన్‌ దాఖలు చేశారు. గురువారం డివిజన్‌ బెంచ్‌లో తెలంగాణ ప్రభుత్వం అప్పీల్‌ పిటిషన్‌ను వేసింది. అప్పీల్‌ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సంపత్‌ల శాసనసభ సభ్యత్వాల పునరుధ్ధరణపై వారంలోపు స్పష్టత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.