కాంగ్రెస్‌లో ఒకే వర్గానికి ప్రాధాన్యం

DAANAM
DAANAM

కాంగ్రెస్‌లో ఒకే వర్గానికి ప్రాధాన్యం

టిఆర్‌ఎస్‌లో చేరుతున్నా: మాజీ మంత్రి దానం నాగేందర్‌

హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో ఒకే వర్గానికి చెందిన నేతలకే ప్రాధాన్యత ఉందని మాజీమంత్రి దానం నాగేందర్‌ ఆరోపించారు. పార్టీలో బిసిలను అణచివేసే కుట్ర జరుగుతోందని ఆత్మగౌరవాన్ని చంపుకుని పార్టీలో కొనసాగలేకే తాను పార్టీ మారుతున్నానని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వానికి రాజీనామాచేసినదానంనాగేందర్‌ శనివారం నగరంలోని ఏర్పాటుచేసిన విలేకరుల సమా వేశంలో మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీలో బిసిలకు ప్రాధాన్యం తగ్గుతోందని అందుకే బడుగు, బలహీన వర్గాలకు చెందిన ముఖ్యనేతలు పార్టీ వీడుతున్నారని అన్నారు. మాజీ పిసిసి డి.శ్రీనివాస్‌, కేశవరావు లాంటి వారు పార్టీ వీడడానికి కారణమిదేనని అన్నారు. పొన్నాల లక్ష్మయ్య లాంటి సీనియర్లకు కూడా పార్టీలో తగిన ప్రాధాన్యం లేదని, మంత్రిగా, పిసిసి అధ్యక్షునిగా చేసిన ఆయనకే వరంగల్‌లో సభ పెడితే కనీసం చెప్పలేద న్నారు.