కాంగ్రెస్‌లోకి రేవంత్‌?

Revanth Reddy
Revanth Reddy

కాంగ్రెస్‌లోకి రేవంత్‌?

టి.టిడిపికి భారీ షాక్‌!  కాంగ్రెస్‌లో చేరటం లేదని మధ్యాహ్నం ప్రకటన..
సాయంత్రం రాహుల్‌తో భేటీ!
నవంబరు 9న రాహుల్‌ సమక్షంలో ఆ పార్టీలో చేరుతారనే ప్రచారం
టిిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, మంత్రులపై ఇసికి ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీకి వచ్చానన్న రేవంత్‌

న్యూఢిల్లీ, హైదరాబాద్‌, కొడంగల్‌,: టి.టిడిపికి భారీ షాక్‌ తగిలింది. ఆపార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎ. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఈమేరకు ఆయన మంగళవారం సాయంత్రం న్యూఢిల్లీ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీతో భేటీ అయ్యారు. నవంబర్‌ 9వ తేదీన రేవంత్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేర టానికి ముహుర్తం ఖరారైనట్లు సమాచారం. అదేరోజు రాహుల్‌గాంధీ తెలంగాణలో పర్యటనకు రానున్నట్లు తెలు స్తోంది. నవంబర్‌ 9న హైదరాబాద్‌లో జరిగే బహిరంగ సభలో రాహుల్‌ సమక్షంలో రేవంత్‌ కాంగ్రెస్‌లోకి అధికారి కంగా చేరుతారని తెలుస్తోంది. కాగా గత కొంతకాలంగా అధికార టిఆర్‌ఎస్‌తో టి.టిడిపి పొత్తు నిర్ణయాని ఆయన తీవ్రంగా వ్యతికేస్తు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధపడ్డారు. ఢిల్లీలోనే మకాం వేసిన ఆయన కాంగ్రెస్‌ అధిష్టానం పెద్దలతో చర్చలకు రాయబారం నడిపారు. రెండు, మూడు రోజుల్లోనే రేవంత్‌ కాంగ్రెస్‌లో చేరికకు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అయితే దీనిపై అటు కాంగ్రెస్‌ కానీ, ఇటు.. రేవంత్‌గానీ ఇప్పటి వరకు అధికారిక ప్రకటన చేయలేదు.