కాంగ్రెస్‌,బిజెపిలకు మరో పరీక్ష

BYPOLLS
BYPOLLS

న్యూఢిల్లీ: ఎన్నికయుద్ధం కర్ణాటకతోనేముగిసిపోలేదు. ఉప ఎన్నికలపరంగా కాంగ్రెస్‌,బిజెపిలపోరు మళ్లీ కొనసాగుతోంది. దేశంలోని నాలుగు లోక్‌సభ నియోజకవర్గాలు, పది అసెంబ్లీ స్థానాలకు సోమవారం ఉప ఎన్నికల పోలింగ్‌ ఝరుగుతోంది. అలాగే కర్ణాటకలోని ఆర్‌ఆర్‌నగర్‌ నియోజకవర్గంలోసైతం ఇదేరోజు పోలింగ్‌ జరుగుతున్నది. కర్ణాటక ఎన్నికల ప్రభావంతో కొంత షాక్‌కు గురయినా బిజెపి మళ్లీ ఉప ఎన్నికలపరంగా పుంజుకోవాలనిచూస్తోంది. కాంగ్రెస్‌ మరోసారి తన పట్టును నిరూపించుకునేందుకు సిద్ధం అవుతున్నది. జాతీయ, ప్రాంతీయ పార్టీలు సైతం తమతమ ప్రాంతాల్లో ఉనికిని చాటుకోవాలనుకుంటున్నాయి. పది అసెంబ్లీ నియోజకవర్గాలు, నాలుగు లోక్‌సభ నియోజకవర్గాలకు పది రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని ఖైరానా, పాల్‌ఘర్‌, భాండారా గోండియా మహారాష్ట్రలోను, నాగాలాండ్‌లోని సోల్‌ పార్లమెంటరీ నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతున్నాయి. అసెంబీ లుప ఎన్నికలపరంగా యుపిలో నూర్పుర్‌, పంజాబ్‌లోని షాకోట్‌, బీహార్‌లోని జోకిహట్‌, జార్ఖండ్‌లోని గోమియా, సిల్లి, కేరళలోని చెంగన్నూరు, మహారాష్ట్రలోని పాల్స్‌ కాడేగావ్‌, మేఘాలయలో అంపటి, ఉత్తరాఖండ్‌లోని థారాలి, పశ్చిమబెంగాల్‌లోని మహేస్థల స్థానాలకు ఎన్నికలుజరుగుతున్నాయి.ఓట్లలెక్కింపు ఈ నెల 31వ తేదీ వెల్లడి అవుతుంది. కర్ణాటకలో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించినా బిజెపి అధికారానికి రాలేకపోయింది. ఈ ప్రభావం వచ్చే ఉప ఎన్నికల్లో పడకుండా చూడాలని చూస్తోంది. ఇక కైరానా, నూర్పుర్‌ అసెంబ్లీస్థానాలు బిజెపికి ప్రతిష్టాత్మకం అయ్యాయి. గతంలో రెండు నియోజకవర్గాలు నష్టపోయిన బిజెపి ఈసారి నష్టం భర్తీచేసుకుంటున్నది. పసమాజ్‌వాది, బహుజన్‌పమాజ్‌ పార్టీ చేతులు కలపడంతో బిజెపి కొంతమేర గట్టిపోటీని ఎదుర్కొనాల్సిందే. గోరఖ్‌పూర్‌, ఫుల్పూర్‌ ప్రాంతాల్లో సమాజ్‌వాది అభ్యర్ధులు గెలవడంతోప్రతిపక్షాలుసైతం ఒక సమిష్టి అవగాహనకు వచ్చి బిజెపికి అవకాశం ఇవ్వకూడదనినిర్ణయించాయి. అంతేకాకుండా 2019 లోక్‌సభ ఎన్నికలకుసైతం సమిష్టికూటమి పనిచేయాలన్న భావన వ్యక్తంచేస్తున్నాయి. కైరానాలో మాజీ ఎంపి తబుస్సుమ్‌ హసన్‌ ప్రతిపక్ష జాయింట్‌ అభ్యర్ధిగా ఉన్నారు. ఈసారి ఆర్‌ఎల్‌డి టికెట్‌పైపోటీచేస్తున్నారు. సమాజవాదిపార్టీ అజిత్‌సింగ్‌ ఆర్‌ఎల్‌డిలు తమ ప్రత్యర్ధులు జాట్‌లు, ముస్లింలను చేరదీసి బిజెపిని తరిమికొట్టే వ్యూహం వేస్తున్నాయి. బిఎస్‌పి కాంగ్రెస్‌ ఈ ఉప ఎన్నికల్లో ఓటీచేయడంలేదు. వారి మద్దతుసైతం ప్రతిపక్ష అభ్యర్ధులకే ఉంటుంది. ఇక నూర్పుర్‌లో ప్రధాన పోటీ బిజెపి అవినిష్‌సింగ్‌, సమాజ్‌వాదిపార్టీ నాయివ్‌ుల్‌ హసన్‌లమధ్యనే ఉంటుంది. ఇక్కడ బిఎస్‌పి అభ్యర్ధిని పోటీకి నిలపలేదు. లోక్‌దళ్‌ గోహర్‌ ఇక్బాల్‌, రాష్ట్రీయజనహిత్‌సంఘర్ష్‌ పార్టీ జహీర్‌ ఆలమ్‌, భారతీయ మోమిన్‌ఫ్రంట్స్‌ మాయా, యుపి రిప్లబ్లికన్‌పార్టీ రామ్‌రతన్‌, మరో నలుగురు స్వతంత్ర అభ్యర్ధులుపోటీలో ఉన్నారు. కైరానా తరహాలోనే మహారాష్ట్రలోని భండారా గోండియా పాల్‌ఘర్‌ లోక్‌సభ స్థానాలకు పోటీ నెలకొంది. సిట్టింగ్‌ ఎంపి నానాపాటోల్‌ బిజెకి రాజీనామా చేసారు. కాంగ్రెస్‌లో చేరేందుకు నిర్ణయించారు. పాల్‌ఘర్‌ స్థానం ఉత్తర కొంకణ్‌ ప్రాంతంలో ఖాళీగా ఉంది. ఇప్పంటికే పాల్‌ఘర్‌లో ఇప్పటికే బిజెపి షాక్‌ తిన్నది. వంగా కుటుంబం బిజెపిని వీడి శివసేనలో చేరుతోంది.కేంద్రరాస్ట్రాల్లో మిత్రపక్షంగానే ఉన్నప్పటికీ ఉప ఎన్నికల్లో ఎలాంటి పొత్తులకు రాలేదు. సేనా బిజెపి మాజీ ఎంపి కుమారుడు శ్రీనివాస్‌ చింతమన్‌ వంగాను పోటీచేయిస్తోంది. బిజెపి ఇక్కడ గవిట్‌ రాజేంద్ర దేడ్యా, కాంగ్రెస్‌ దామోదర్‌ బర్కుసింఘాడా పోటీచేస్తున్నారు. పోటి బిజెపి అభ్యర్ధి హేమంత్‌ పాటిల్‌, ఎన్‌సిపికి చెందిన మధుకర్‌ కెక్డేలమధ్యనే ఉంది. ఎనిమిది మంది స్వతంత్రులుసైతం పోటీలో ఉన్నారు. ఇక పాలస్‌ కడేగావ్‌ అసెంబీ లస్థానంలో గెలిచే అవకాశం ఉంది. కాంగ్రెస్‌ అభ్యర్ధి కదమ్‌ విశ్వజిత్‌ పాటన్‌గ్రో ఒక్కఏ అభ్యర్ధిగా నిలతిచారు. ఇతర పార్టీలనుంచి అందరి నామినేషన్లు తిరస్కరించడమో వారు విత్‌డ్రాచేసుకోవడమో జరిగాయి. ఇక నాగాలాండ్‌ ఉప ఎన్నికలో సోలే నియోజకవర్గం కేంద్ర బిందువుగా మారింది. ఈ నియోజకవర్గంలో ఎన్‌డిపిపి అభ్యర్ధి తొకేహేహో యెప్తోమి, ఎన్‌పిఎఫ్‌నుంచి సి.ఆపాక్‌జమీర్‌లు పోటీలో ఉన్నారు. ఎన్‌డిపిపి నైఫ్యూరియో రాజీనామాచేసిన నాగాలాండ్‌ముఖ్యమంత్రిగా పదవీస్వీకారం చేయడే ఇందుకుకీలకం. ఇక నూర్పూర్‌తోపాటు మహారాష్ట్రలోని పాలస్‌ కడేగాంవ్‌, మరో ఎనిమిదిస్థానాల్లో పోలింగ్‌జరుగుతున్నది. మేఘాలయలో అంపట్‌ నియోజకవర్గంలో పోటీ ఉంది.ముకుల్‌సంగ్మా గెలిచిన ఈ స్థానంలో ఇపుడు గట్టిపోటీ వస్తోంది. ఎన్‌పిపి అభ్యర్ధి జి.మోమిన్‌, కాంగ్రెస్‌నుంచి మియాని డి.షీరా, స్వతంత్ర అభ్యర్ధి శుభాంకర్‌కోచ్‌లు పోటీలో ఉన్నారు. జార్ఖండ్‌లోఇ రెండుస్థానాలు సిల్లియా, గోమియాల్లో మొత్తం 23గ్గురుపోటీలో ఉన్నారు. ఎజెఎస్‌యు, బిజెపి లో గోమియాలో పోటీ చేస్తున్నాయి. బిజెపి మాధవ్‌లాల్‌సింగ్‌ ఎజెఎస్‌యు లాంబోదర్‌ మహతోపైపోటీకి ఉన్నారు. జెఎంఎం ఉమేష్‌కుమార్‌ మెహతో కూడాగట్టిఓటీ ఇస్తున్నారు. ఇక సిల్లియో నియోజకవర్గంలో ఎజెఎస్‌యు ఒక్కటే నామినేషన్‌ దాఖలుచేసింది. సుధేష్‌ఖుమార్‌ మహతో ఆర్‌జెడికి చెందిన జ్యోతిప్రసాద్‌పై పోటీచేస్తున్నారు. ఇక పంజాబ్‌పరంగాచూస్తే షాకోట్‌ ఉప ఎన్నిక గట్టిపోటీనడుస్తున్నది. శిరోమణి అకాలిదళ్‌, కాంగ్రెస్‌పార్టీలు, బిజెపిలమధ్యనే ఈ పోటీ ఉంది. ఇక బీహార్‌లో ఆరారియా లోక్‌సభ నియోజకవర్గం ఆర్‌జెడి ఈఏడాది మార్చిలో మంచి మ7ఎజార్టీసాధించింది. జోకిహట్‌లో జనతాదళ్‌యు, ఆర్‌జెడిలమధ్య గట్టిపోటీ ఉంటుంది. తొమ్మిది మంది అభ్యర్ధులున్నారు. కేరళలోను, ఉత్తరాఖండ్‌, పశ్చిమబెంగాల్‌లలోసైతం ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. వీటికి పోలింగ్‌ సైతం సోమవారం జరుగుతుండటం విశేషం.