కాంగ్రెస్‌ను న‌మ్మెస్థితిలో ప్ర‌జ‌లు లేరుః దానం

Danam Nagender
Danam Nagender

హైద‌రాబాద్ఃసీఎం కేసీఆర్‌కు ఎంత ఆదరణ ఉందో రాహుల్ గాంధీ ఇంటింటికీ తిరిగి తెలుసుకోవాలని టీఆర్ఎస్ నేత దానం నాగేందర్ అన్నారు. మంగ‌ళ‌వారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ కుటుంబం గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీ నేతలకు లేదని అన్నారు. సామాజిక న్యాయం గురించి రాహుల్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు.  వచ్చే ఎన్నికల్లో హైదరాబాద్ సిటీలో కాంగ్రెస్ పార్టీకి ఒక్కచోట కూడా డిపాజిట్ రాదని, ఆ పార్టీ నాయకులు అడ్రస్ లేకుండా పోతారని, రాహుల్ గాంధీ పర్యటన అట్టర్ ప్లాప్ అయిందని, కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు.ఆ పార్టీ నేతల ముఖం చూసి ఎవరైనా ఓట్లు వేస్తారా? అని ప్రశ్నించారు. తెలంగాణ గురించి రాహుల్ గాంధీ ఒక్కసారైనా పార్లమెంట్ లో మాట్లాడారా? అని ప్రశ్నించారు కాంగ్రెస్ పాలనతో బడుగు, బలహీన వర్గాలకు చేసిందేమీ లేదని, హైదరాబాద్ ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతున్నామని, ఇక్కడి సీమాంధ్రులంతా కేసీఆర్ వెంటే ఉన్నారని అన్నారు. కిరాయికి ప్రజలను తీసుకొచ్చి కాంగ్రెస్ నేతలు ర్యాలీ నిర్వహించారని ఆరోపించారు.