కాంగ్రెస్‌కు ప్రాజెక్టులను అడ్డుకోవడం పరిపాటి: జగదీష్‌రెడ్డి

G. Jagadish reddy
G. Jagadish reddy

సూర్యాపేట: రాష్ట్రంలో పథకాలు అమలుకాకమునుపే కాంగ్రెస్‌ అవినీతి జరిగిందని చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి మండిపడ్డారు. మంత్రి జగదీష్‌, నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావుతో కలిసి నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు ప్రగతి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలుత కేతేపల్లి మండలం ఇప్పలగూడెంలో రూ.2కోట్లతో నిర్మించే 5వేల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం గల గోదాములకు మంత్రులు భూమి పూజ చేశారు. ఆ తర్వాత కేతేపల్లి మండలం కొత్తపేటలో ధాన్యం కోనుగోలు కేంద్రాన్ని మంత్రి హరీష్‌రావు పరిశీలించారు. తదనంతరం జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్‌కు వచ్చే ఎన్నికల్లో ప్రజలే గుణపాఠం చెపుతారన్నారు. కాంగ్రెస్‌ నేతలకు ప్రాజెక్టులను అడ్డుకోవడం పరిపాటిగా మారిందన్నారు. అధికార ప్రభుత్వం పథకాలను ప్రవేశపెడుతున్నది. రైతులకు లాభం జరగడం లేదన్న కాంగ్రెస్‌కు, టిపిసిసి చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఇష్టం లేదన్నారు.