కాంగోవైద్యుడు, ఇరాకీ మహిళకు నోబెల్‌ శాంతిపురస్కారం!

NOBELPE1
NOBELPE1

ఓస్లో : కాంగోకు చెందిన వైద్యులు డా.డెనిస్‌ ముక్వేగే, యాజిది ప్రచారకర్త నదియా మురాద్‌లు 2018 నోబెల్‌ శాంతిపురస్కారాలకు ఎంపికయ్యారు. శుక్రవారం నోబెల్‌ కమిటీ ఈ పురస్కారాల అభ్యర్ధులనుప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా వీరు జరిపిన విస్తృత ప్రచారం, పోరుకు గుర్తుగా ఈ శాంతిపురస్కారం లభించింది. యుద్ధానికి ఆయుధంగా లైంగిక హింసను తుదముట్టించాలన్న లక్ష్యంతో వీరిద్దరి కృషి శ్లాఘనీయమని రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ వర్ణిఇంచింది. నోబెల్‌ కమిటీ మహిళా ఛైర్మన్‌బెరిట్‌ రెసిస్‌ ఆండర్సన్‌ మాట్లాడుతూ వీరిద్దరికృషి ప్రపంచ వ్యాప్తంగా మరికొందరికి స్ఫూర్తిదాయకం అవుతుందని వెల్లడించారు. మహిళలు వారి ప్రాథమిక హక్కుల పరిరక్షణ జరిగినపుడే ప్రపంచ శాంతికి మార్గం ఏర్పడుతుందని నోబల్‌ కమిటీ ఛైర్మన్‌ వెల్లడించారు. ముక్వేగే, మురాద్‌ ఇద్దరూ ఇదే పోరుకు శ్రీకారం చుట్టారని, ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోతున్న ఈ లైంగిక హింసనుకట్టడిచేసేందుకు అనన్యరీతిలో కృషిచేసారని వెల్లడించారు. 63 ఏళ్ల ముక్వేగే రెండుదశాబ్దాలుగా చేస్తున్న కృషికి గుర్తింపు లభించింది. లైంగిక వేధింపులు, హింసనుంచి మహిళలకు సాయం చేసేందుకు ఆయన చేసిన పోరు ఇప్పటికీ కొనసాగిస్తున్నారని తూర్పుప్రాంత డెమొక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగోలో ముక్వేగే కృషి ప్రపంచ దేశాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. అత్యాచారబాధితులైన మహిళలు, పిల్లలు, కనీసం అప్పుడే పుట్టిన పసికందులనుసైతం తన పాంజి ఆసుపత్రిలో చికిత్సలు చేసారు. కాంగోలోని సౌత్‌ కివులో ఉన్న పాంజి ఆసుపత్రిని 1999లో కేవలం ఈ సేవలకోసమే స్థాపించారు. వైద్యుని అధ్భుతంగా ఆయన్ను కొనియాడేప్రజలకు ఆయన ఆరాధ్యదైవంగా నిలిచారు. విమర్శలనుసైతం నిష్కర్షగా చేసే ముక్వేగే యుద్ధసమయాల్లో మహిళలపై అత్యాచారాలుకేవలం విధ్వంసానికే దారితీస్తుందని ఘంటాపథంగా చెప్పేవారు. అలాగే 25 ఏళ్ల ఇరాకి మహిళ మురాద్‌నుసైతం నోబెల్‌ కమిటీ శాంతి పురస్కారానికి ఎంపికచేసింది. 2014లో యాజిది మతానికి చెందిన ఈ పిన్నవయసు మహిళను ఐసిసి మిలిటెంట్లు కిడ్నాప్‌చేసారు. ఊడునెలలపాటు ఆమెను సెక్స్‌బానిసగా కొనసాగించినతర్వాత ఆమె చాకచక్కంగా ఐసిస్‌ విషవలయం నుంచి తప్పించుకోగలిగారు. డెనిస్‌ ముక్వేగే నదియా మురాద్‌లు యుద్ధనేరాలను సాహసోపేతంగా అరికట్టడంలో వారి వ్యక్తిగత సెక్యూరిటీనిసైతం సమస్యల్లో పెట్టేవారని నిపుణులు చెపుతున్నారు. బాధితులకు న్యాయం కోసం ఏస్థాయికైనా వెళ్లేవారని నార్వేజియన్‌ నోబెల్‌ కమిటీ వెల్లడించింది. అంతర్జాతీయ చట్టాలను అనుసరించి వారు సోదర దేశాలకు ప్రాథమిక సూత్రాలను వివరించి చెప్పేవారని తేలింది. ఇక నోబెల్‌ సాహిత్య బహుమతి 70 ఏళ్లతర్వాత మొదటిసారి వాయిదా పడింది. స్వీడిష్‌ ఎకాడమిలో హ్యాష్‌ మీటూ ఉద్యమంలో పాత్ర ఉందని వెల్లడించడంతో శాంతి బహుమతిని వాయిదావేసారు. మొత్తం 331మంది వ్యక్తులు, సంస్థలు శాంతిపురస్కారానికి ఇప్పటివరకూ ఎంపికయ్యారు. వచ్చే డిసెంబరు 10వ తేదీ ఓస్లోలో జరిగే ప్రత్యేక వేడుకల్లో ఈ పురస్కారాలను పంపిణీచేస్తారు. స్వీడన్‌ శాస్త్రవేత్త, విరాళ దాతగాను, నోబెల్‌ సృష్టికర్త అయిన ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ వర్ధంతి సందర్భంగా ఆరోజు ఈ పురస్కారాలు అందచేస్తారు.