దేవుడులాంటి మనిషి!

Krishan11
New book Released

 దేవుడులాంటి మనిషి!

సూపర్‌స్టార్‌ కష్ణ 50 నట వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా సీనియర్‌ పాత్రికేయులు వినాయకరావు కష్ణ నట జీవితంపై, కష్ణ నటించిన 365 చిత్రాలు గురించి దేవుడులాంటి మనిషి అనే పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం శనివారం హైదరాబాద్‌ పార్క్‌ హయత్‌లో జరిగింది. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం టి.సుబ్బరామిరెడ్డి అధ్యక్షతన లలితకళా పరిషత్‌వారు నిర్వహించారు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు పుస్తకావిష్కరణ చేసి తొలి ప్రతిని కష్ణ, విజయనిర్మల దంపతులకు అందించారు. ఈ సందర్భంగా..

సూపర్‌ స్టార్‌ కష్ణ మాట్లాడుతూ.. వినాయకరావు నాపై పుస్తకం రాస్తానంటే ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తావని అడిగాను. అప్పుడు తను ఒక సంవత్సరంలో పూర్తి చేస్తానని అన్నారు. కానీ ఒక సంవత్సరం తర్వాత నన్ను కలుసుకుని సమాచార సేకరణ ఇంకా సమయం పడుతుందని చెప్పి, అల్లూరి సీతారామరాజు సినిమా మేకింగ్‌పై ఆయన రాసిన బుక్‌లెట్‌ను విడుదల చేశారు. మూడు సంత్సరాలు పాటు వినాయరావు బాగా కష్టపడి, చాలా మందిని కలిసి, ఫోటోలు సేకరించి ఈ పుస్తకాన్ని రాసినందుకు వినాయకరావుగారిని అభినందిస్తున్నాను. నేను నటుడిగా 50 నట వసంతాలను పూర్తి చేసుకున్నానంటే అందుకు కారణం నా దర్శకులు, నిర్మాతలు, నా తోటి నటీనటులు, టెక్నిషియన్సే కారణం అన్నారు.

టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ.. సినిమా పరిశ్రమలో ఎంతో మంది ఉన్నా కొంత మంది పేరు మాత్రమే మనకు వినడుతుంది. అటువంటి కొంత మందిలో సూపర్‌స్టార్‌ కష్ణ ఒకరు. మానవత్వం మూర్తీ భవించిన వ్యక్తి కష్ణగారు నటించిన 365 సినిమాలపై వినాయకరావు మూడేళ్ల పాటు కష్టపడి రచించారు. వినాయకరావుకు అభినందనలు అన్నారు.

కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. పురాణాల్లో ఉత్తమ విలువలున్న శ్రీరాముడిలా తెలుగు సినిమాలో ఉత్తమ విలువలున్న వ్యక్తి సూపర్‌స్టార్‌ కష్ణగారు. ఆయన తన విలువలతో సూపర్‌ స్టార్‌గా ఎదిగారు అన్నారు. వినాయకరావు మాట్లాడుతూ.. తెలుగు సినిమాను సుసంపన్నం చేసిన గొప్ప వ్యక్తుల గురించి ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఓ జర్నలిస్ట్‌గా నాపై ఉందని భావించి పుస్తకాలు రాస్తున్నాను. ఇప్పటి వరకు నేను 9 పుస్తకాలు రచించాను. సూపర్‌స్టార్‌ కష్ణగారిపై ఈ పుస్తకం రెడీ కావడానికి మూడేళ్ల సమయం పట్టింది అన్నారు.