కష్ణగాడి వీర ప్రేమగాథ ఆడియో విడుదల

Krishna Gadi Veera Premagaadha Audio Launch
నాని, మెహరీన్‌ జంటగా 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై రూపొందుతోన్న చిత్రం కష్ణగాడి వీర ప్రేమగాథ. హను రాఘవపూడి దర్శకత్వంలో ఈ చిత్రానఇన రామ్‌ అచంట, గోపీచంద్‌ అచంట, అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు. విశాల్‌ చంద్రశేఖర్‌ మ్యూజిక్‌ అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. లహరి ద్వారా ఆడియో మార్కెట్లోకి విడుదలైంది. ఈ కార్యక్రమంలో సూపర్‌స్టార్‌ మ హేష్‌, రత్నవేలు, నాని, మెహరీన్‌, స్రవంతి రవికిషోర్‌, సుకుమార్‌, అల్లరి నరేష్‌, అభిషేక్‌ పిక్చర్స్‌ అభిషేక్‌, పాటల రచయిత కె.కె. అవసారాల శ్రీనివాస్‌, సంతోష్‌ శ్రీనివాస్‌, ఫైట్‌ మాస్టర్‌ విజ§్‌ు, మ్యూజిక్‌ డైరెక్టర్‌ విశాల్‌ చంద్రశేఖర్‌, లహరి చంద్రు తదితరులు ఈ కార్యమ్రానికి హాజరయ్యారు.బిగ్‌ సీడి, ఆడియో సిడిలను సూపర్‌స్టార్‌ మహేష్‌ విడుదల చేశారు.సూపర్‌స్టార్‌ మహేష్‌ మాట్లాడుతూ ఈ సినిమాలో యాక్ట్‌ చేసిన చిన్నారులు బాగా నచ్చారు. మా 14 రీల్స్‌ నిర్మాతలు, సినిమాటోగ్రాఫర్‌ రత్నవేలు ఇక్కడే ఉన్నారు. ఈ సినిమా జర్నీలో నాకు ఒక బ్రదర్‌లామారాడు. ఈ సినిమాలో నటించిన చిన్నారులే మాకు ఎనర్జీ. మహేష్‌గారికి థాంక్స్‌. సపోర్ట్‌ చేసిన అందరికీ థాంక్స్‌ అన్నారు.అనిల్‌ సుంకర మాట్లాడుతూ ఒక సంవత్సరం క్రితం మేం తెలిసి చేసిన, తెలియక చేసిన తప్పుల వల్ల 14 రీల్స్‌ ట్రబుల్స్‌న ఫేస్‌ చేసింది. అయితే మాతో వర్‌క చేసిన స్టార్‌ హీరోలు, నటీనటులు, ెక్నిషియన్స్‌ అందరూ 14 రీల్స్‌ చిరునవ్వుతో ఉండాలని కోరుకున్నారు. ఈ సినిమాను కూడా ముగ్గురు విని ఓకే చేశాం. హను, విశాల్‌ చంద్రశేఖర్‌, అందూ హార్డ్‌ వర్క్‌ చేశారు. నాని ఫ్యాన్స్‌కు ఓ విజయం వస్తుంది అన్నారు. హను రాఘవపూడి మాట్లాడుతూ ఈ సినిమాని హ్యండిల్‌ చేయడం కష్టమనుకున్నాను. కానీ చాలా ఈజీగా చేసేశాను. అందరూ బాగా సపోర్ట్‌ చేశారు. మెహరీన్‌ మహాలక్ష్మిగా బాగా చేసింది. సపోర్ట్‌ చేసిన అందరికీ థాంక్స్‌ అన్నారు. రత్నవేలు మాట్లాడుతూ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన యువరాజ్‌ నా దగ్గర 8 సంవత్సరాలు అసిస్టెంట్‌గా వర్క్‌ చేశాడు. సూర్య సన్నాఫ్‌ కష్ణన్‌, నెనొక్కడినే చిత్రాలకు వర్‌కచేశాడు. ఈ సినిమాతో తను మరో లెవల్‌కు వెళతాడని కోరుకుంటున్నాను అన్నారు. స్రవంతి రవికిషోర్‌ మాట్లాడుతూ ఎంటైర్‌ టీంకు బెస్ట్‌ ఆఫ్‌ లక్‌ అన్నారు. సంతోష్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఒక ప్యామిలీ ఎట్మాస్పియర్‌లో అందరూ కష్టపడి చేసిన ఇది. తప్పకుండా పెద్ద హిట్‌ అవుతుంది అన్నారు.సుకుమార్‌ మాట్లాడుతూ ఈ బ్యానర్‌తో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. సినిమా చేసిన తర్వాత కూడా వారి రిలేషన్‌లో ఏమార్పులేదు. ఇలాంటి నిర్మాతలకు సక్సెస్‌ తప్పకుండా వస్తుంది. సినిమాటోగ్రాఫర్‌ రత్నవేలు శిష్యుడైన యువరాజ్‌ కచ్చితంగా పెద్ద కెమెరామెన్‌గా పేరు తెచ్చుకుంటాడు. విశాల్‌ మంచి మ్యూజిక్‌ ఇచ్చారు. నాకు సెకండ్‌ సాంగ్‌ బాగా నచ్చింది అన్నారు.మ్యూజిక్‌ డైరెక్టర్‌ విశాల్‌ చంద్రశేఖర్‌ మాట్లాడుతూ ఈ బ్యానర్‌లో ఇంత మంచి సినిమా చేసే అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఉంది. సంగీతం నచ్చిందని అనుకుంటున్నారు. అవకాశం ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకు థాంక్స్‌ అన్నారు.