కష్టంగా మారిన దైవదర్శనం

   ప్రజావాక్కు

                           కష్టంగా మారిన దైవదర్శనం

waiting for god darshan
waiting for god darshan

కష్టంగా మారిన దైవదర్శనం
రాష్ట్రంలో తిరుపతి, శ్రీశైలం, భద్రాచలం, అన్నవరం వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలలో స్వామివార్ల దర్శనం సులభంగా, సంతృప్తికరంగా సాగడంలేదు. ఎంతో ధనవ్యయంతో, వ్యయ ప్రయాసల కోర్చి ప్రయాణం చేసి దేవాలయాలకు వచ్చి గంట ల తరబడి వేచిచూస్తే కొన్ని సెకన్ల పాటు దర్శనం లభించడం దుర్లభమవ్ఞతోంది. అదే విఐపిలు,మంత్రులురాజ్యాంగ ఉన్నత పదవ్ఞలలో ఉన్న వారికైతే ఆలయఅధికారులు, ప్రభుత్వ యం త్రాంగం దగ్గరుండి సేవలు చేస్తున్నారు. భక్తుల సాధక బాధక లు వారికి ఏర్పాట్లు చేయడంలో ఆలయ అధికారులు తీవ్ర అలసత్వం చూపుతున్నారు. ఇక అన్ని రకాల ఆర్జిత సేవలకు రుసుం భారీగా పెంచేసి సామాన్యులకు దైవదర్శనం దూరం చేస్తున్నారు. విఐపిలకు ప్రత్యేక దర్శనం,అర్చక ఏర్పాట్ల వలన సామాన్య భక్తులకు అసౌకర్యం కలిగించడం సముచితంకాదు.
-సి.ప్రతాప్‌, శ్రీకాకుళం

ప్రజలకు రక్షణ కరవైంది
ఇంతకుముందు పనిచేసిన ప్రభుత్వాల హయాంలో కొందరే అభద్రతా భావంతో జీవించే వారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు అభద్రతా భావంతోనే మెలగవలసి వస్తోంది. పేదలు, సామా న్యులతోపాటు సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్న ప్రముఖులు కూడా రక్షణ లేక అలమటిస్తున్నారు. గాయకులు, రచయితలు హతమైన సంఘటనలు అనేక రాష్ట్రాలలో జరుగుతున్నాయి. సినీ నటులు వేధింపులకు గురువ్ఞతున్నారు. ప్రత్యక్షపార్టీలకు చెందిన నాయకుల పరిస్థితి కూడా ఏమీ బావ్ఞండటం లేదు. నానా అవస్థలు పడుతున్నారు. ఇదిలావ్ఞంటే బాబాలుగా పిలవబడుతున్న వారు మహిళలు, బాలికలపై అత్యాచారాలు చేస్తున్నారు. హతమారుస్తున్నారు.
-మిథునం, హైదరాబాద్‌

అవినీతిని అరికట్టాలి
ఇటీవలి కాలంలో అవినీతి నిరోధక శాఖ జరిపిన దాడుల లో భారీగా అక్రమాస్తులను కూడగట్టిన అనేక మంది కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పట్టుబడడం చూస్తుంటే దేశంలో అవినీతి ఏ స్థాయిలో వేళ్లూనుకొని ఉందో అర్థమవ్ఞతోంది. వ్యవస్థలోని లోపాలను అడ్డుపెట్టుకొని అడ్డూ,అదుపు లేకుండా ప్రజాధనం దుర్వినియోగానికి పాల్పడిన వారిలో కొందరు ఎసిబికి చిక్కారు. ఇంకా ఎన్నో భారీ అవినీతి తిమింగలాలు చట్టానికి దొరకకుండా తప్పిం చుకుంటున్నాయన్నది నిర్వివాదాంశం.
-ఎన్‌.రామకృష్ణ, హైదరాబాద్‌

పెరిగిన ధరలతో ఇబ్బందులు
పట్టణంలో కూరగాయల వ్యాపారులు పట్టపగలే ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు. నిబంధనల ప్రకారం ధరల సూచీని ఏర్పాటు చేయకుండా ఇష్టారాజ్యంగా ధరలు పెంచేసి ప్రజలతో ఆడుకుంటున్నారు. డీజిల్‌ పెరుగుదల, జియస్‌టి, అనావృష్టి పరిస్థితులు ఇత్యాది కారణాలను సాకుగా చూపుతూ గత నెలరోజుల నుండి కూరగాయల ధరలను అమాంతం పెంచే సారు. ఇక్కడ దళారులందరూ ఒక రింగ్‌గా ఏర్పడి ధరలను నిర్ణయిస్తున్నారు. రైతుబజార్లలో సైతం ధరలు పెరిగేలా ఈ దళారులు ఒత్తిడి చేస్తున్నారు.
-ఎం.కనకదుర్గ,తెనాలి, గుంటూరుజిల్లా

యోగా తప్పనిసరి చేయాలి
మానసిక సమస్యలతో బాధపడే వ్యక్తికి సమాజంలో గౌరవ ప్రదమైన స్థానం ఉండదు. యాంత్రిక, ఆధునిక జీవనంలో తీవ్రమైన ఒత్తిడి చిన్న వయస్సు నుండే వెంటాడుతుండడంతో నగరాలలో మానసిక రోగుల సంఖ్య నానాటికీ పెరుగుతుం డడం ఒక నూతన సామాజిక సమస్యకు శ్రీకారం చుట్టింది. మానసిక వ్యాధులతో బాధపడే వారు ప్రతీరోజు యోగ చేయ డం వలన కొంత వరకు ఉపశమనం కలుగుతుంది.
-కె.మాధవతేజ, హైదరాబాద్‌

ఫోన్లతో ప్రాణానికి ప్రమాదం
నేటి పిల్లలు, యువత, పెద్దలు మొబైల్‌ ఫోన్సు లలోని ఫీచర్లకు బానిసలు అవ్ఞతూ ప్రాణాల మీదికి తెచ్చుకుం టున్నారు. కారు డ్రైవింగ్‌ చేస్తున్నా, బైక్‌ డ్రైవింగ్‌ చేస్తున్నా, రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నా చెవిలో ఇయర్‌ ఫోన్సు పెట్టు కుని పెద్ద సౌండ్స్‌తో పాటు వింటూ వెళ్తున్నారు.రోడ్లపై నడిచే వారు ఇలా పాటలు వింటూ పరధాన్యంతో రోడ్లపై వచ్చే భారీ వాహనాలను గమనించక, ప్రాణాలను కోల్పోతున్నారు.
-సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం

మందుల కంపెనీల బెడద
అసలే రోగాలతో సతమతమయ్యేరోగులు డాక్టర్లవైఖరితో మరిం త మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. పేరున్న కొంత మంది వైద్యులు రాసిన మందలు దొరకాలంటే కనీసం అరడజను మెడికల్‌ దుకాణాల చుట్టూ తిరగాల్సిందే. ఆ మందులు లేకపో తే ఒకటే కాంబినేషన్‌ అంటూ ఇతర కంపెనీల మందులను అంటగట్టే ప్రయత్నాన్ని మెడికల్‌ షాపుల వారు చేస్తున్నారు. ప్రజలప్రాణాలతో డాక్టర్లు, మెడికల్‌ సిబ్బంది ఆటలాడుతున్నారు.
-సి.హెచ్‌.సాయిరుత్విక్‌, నల్గొండ