కశ్యప్‌కు కఠిన డ్రా

Kasyap
Kasyap

కశ్యప్‌కు కఠిన డ్రా

సిడ్నీ: కామన్వెల్త్‌ క్రీడల విజేత పారుపల్లి కశ్వప్‌కు ఆస్ట్రేలియా బ్యాడ్మింటన్‌ సూపర్‌ సిరీస్‌లో కఠిన డ్రా ఎదురైంది. రెండు అర్హత మ్యాచ్‌లు గెలిచి మెయిన్‌ డ్రాకు అర్హత సాధించిన ప్రణ§్‌ు తన తొలి మ్యాచ్‌ లో ప్రపంచ నంబర్‌వన్‌ కొరియా క్రీడాకారుడు సన్‌వాన్‌హోతో తలపడనున్నాడు. ఇండోనేషియా సూపర్‌ సిరీస్‌ విజేత కిడాంబి శ్రీకాంత్‌ క్వాలిఫయిర్‌ చైనీస్‌తైపీ క్రీడాకారుడు కాన్‌ చావోయును ఎదుర్కో నున్నాడు. ఇండోనేషియా ఒలంపిక్‌ పతక విజేతలను ఓడించిన హెచ్‌ఎస్‌ ప్రణ§్‌ు ఇంగ్లాండ్‌కుచెందిన రాజీవ్‌ ఔసెఫ్‌తో తలపడను న్నాడు. యువ ఆటగాడు సిరిల్‌ వర్మ మెయిన్‌ డ్రాకు అర్హత సాధించాడు. మహిళల సింగిల్స్‌లో మెయిన్‌డ్రాకు అర్హతసాధించిన రుత్వికశివాని చైనా క్రీడాకారిణి చెన్‌ జియావోజిన్‌ తో తలపడనుంది. పివిసింధు, సైనానెహ్వాల్‌,సాయిప్రణీత్‌ తమ ప్రస్థానాన్ని బుధవారం ప్రారంభిస్తారు.