కశ్మీర్‌లో రాష్ట్రపతి పాలనకు లోక్‌సభ ఆమోదం

LOKSABHA1
LOKSABHA

న్యూఢిల్లీ: కశ్మర్‌లో రాష్ట్రపతి పాలన విషయం కోసం లోక్‌సభలో చర్చ జరిగింది. కశ్మీర్‌లో ప్రమాదకర ఉద్యమం జరుగుతుందని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌ అన్నారు. ఆకారణంగానే ఆరాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించామన్నారు. కశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించమని మేము ఎప్పుడు చెప్పలేదని ఆయన తెలపారు. పద్దతి ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర‌ప‌తి పాల‌న త‌ర్వాత ప్ర‌జ‌లు సంతోషంగా ఉన్నార‌ని మంత్రి తెలిపారు. క‌శ్మీర్‌లో రాష్ట్ర‌ప‌తి పాల‌నకు సంబంధించిన చ‌ట్ట‌బ‌ద్ధ తీర్మానాన్ని ఇవాళ లోక్‌స‌భ ఆమోదించింది. రాజ్యాంగంలోని 356 ఆర్టిక‌ల్ ప్ర‌కారం జ‌మ్మూక‌శ్మీర్‌లో రాష్ట్ర‌ప‌తిపాల‌న విధిస్తూ డిసెంబ‌ర్ 19న రాష్ట్ర‌ప‌తి జారీ చేసిన ఆదేశానికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించే తీర్మానాన్ని లోక్‌స‌భ ఆమోదించింది.