కశ్మీర్లో ఎన్కౌంటర్, ఐదుగురు ఉగ్రవాదులు హతం

కశ్మీర్: జమ్మూ-కాశ్మీర్‌లోని హాజిన్ ప్రాంతంలో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన భారీ ఎన్కౌంటర్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. జమ్మూ-కాశ్మీర్ పోలీసులు, భారత సైన్యం సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయి. కాగా మృతులు పాకిస్థాన్
స్పాన్సర్ చేస్తున్న లష్కరే తొయిబాకు చెందినవారని తెలుస్తుంది. ఉగ్రవాద సంస్థ అగ్రనేత లఖ్వీ మేనల్లుడితో పాటు బీఎస్ఎఫ్ జవాను
మహ్మద్ రంజాన్‌ను హత్య చేసిన ఉగ్రవాది కూడా వీరిలో ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై డీజీపీ వైద్య మాట్లాడుతూ ఐదుగురు
లష్కరే-ఇ-తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారని, వీరి వివరాలను తెలుసుకోవాల్సి ఉందని తెలిపారు.