కళ్ళు చెదిరే రీతిలో ప్రీ రిలీజ్ బిజినెస్

Pawan Kalyan New Film Still2
Pawan Kalyan New Film Still

 

కళ్ళు చెదిరే రీతిలో ప్రీ రిలీజ్ బిజినెస్

తెలుగు ఆడియన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాల్లో పవన్ కళ్యాణ్ 25వ చిత్రం కూడా ఉంది. కళ్యాణ్ కు బాగా కలిసొచ్చిన దర్శకుడు త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండటంతో ఇంతటి క్రేజ్ ఏర్పడింది. అభిమానుల్లోని ఈ క్రేజ్ మూలంగానే చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ కళ్ళు చెదిరే రీతిలో జరుగుతోంది. ఇప్పటికే చిత్ర నైజాం డిస్ట్రిబ్యూషన్ హక్కులను రూ.29 కోట్లకు దిల్ రాజు దక్కించుకోగా వర్సెస్ హక్కులు కూడా అదే స్థాయిలో రూ. 21 కోట్లు పలికాయి. బ్లూ స్కై సంస్థ ఈ భారీ మొత్తాన్ని చెల్లించింది. ‘బాహుబలి-2’ తర్వాత ఇంత మొత్తం పలికిన తెలుగు సినిమా ఇదే కావడం చెప్పుకోదగిన విశేషం. ఈ మొత్తం తిరిగి రావాలంటే సినిమా మినిమమ్ హిట్ అవ్వాలి. ఇక సూపర్ హిట్టైతే లాభాలు కూడా భారీగానే ఉంటాయి. అలాగే చిత్ర శాటిలైట్ రైట్స్ రూ.32 కోట్లు పలికాయట. ఈ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుతోంది గనుకే ఓపెనింగ్స్ గ్రాండ్ గా ఉండాలనే ఉద్దేశ్యంతో 2018 జనవరి 10న చిత్రాన్ని సంక్రాంతి సీజన్లో రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఈ చిత్రానికి తమిళ సంగీత దర్శకుడు అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నారు.