కళకళలాడుతున్న దలాల్‌స్ట్రీట్‌

stocks
stocks

ముంబై: అంతర్జాతీయ సానుకూల పరిణామాలతో దలాల్‌ స్ట్రీట్‌ కళకళలాడింది. సోమవారం ఉదయం సూచీలు ఉత్సాహంగా ప్రారంభించాయి. బాంబే స్టాక్‌ ఎక్చ్సేంజి 350 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 10,600 మార్క్‌పైన ముగిసింది. మధ్యాహ్నం తర్వాత ఆర్దిక ,ఆటోమొబైల్‌ తదితర రంగాల్లో మదుపర్లు కొనుగోళ్లు జరపడంతో సూచీలు మళ్లీ పుంజుకున్నాయి. భారీ లాభాల్లో దూసుకెళ్లాయి. ఇప్పటి సెషన్‌లో 373 పాయింట్లు ఎగబాకి 35,354 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ కూడా 102 పాయింట్లు లాభపడి 10,629 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 70. 68 రూపాయలుగా కొనసాగుతుంది.