‘కల్తీ ‘కాటు

‘కల్తీ’ కాటు
హైదరాబాద్: రాష్ట్రంలో నకిలీ,కల్తీ ఎరువులు రైతులను నిలువునా ముంచుతున్నాయి. అక్రమ సంపాదనకు అలవాటుపడిన పలువురు వ్యాపారులు వాటిని రైతులకు యదేఛ్చగా అంటగడుతు న్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నకిలీ ఎరువుల అమ్మకాల ుజోరుగా సాగుతున్నట్లు తెలియవచ్చింది. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు తదితర ప్రాంతాల నుండి తెలంగాణకు నకిలీ ఎరువులు సరఫరా అవుతున్నట్లు సమాచారం. యూని-5, కోబ్రా ప్లస్, హంటలర్, నియో గ్రీన్ బ్రాండ్ల పేరుతో తయారు చేసిన ఎరువులను రాష్ట్రంలో విక్రయిస్తున్నారు. అలాగే కొన్ని కంపెనీలకు ఎలాంటి లైసెన్సు లేకున్నా ఇటువంటి ఎరువులను రైతులకు సరఫరా చేస్తున్నట్లు వెల్లడవుతోంది. జనవరి 1వ తేదీ నుండి ఈ పాస్ యంత్రాల ద్వారానే ఎరువు లను విక్రయించాలనే నిబంధనలు ఉన్నా పలువురు ఫర్టిలైజర్ దుకాణం నిర్వాహకులు ఎరువులను ఆన్లైన్లో నమోదు చేయడం లేదు. రాష్ట్రంలోని మోర్తాడ్ తదితర మండలాల్లో బయో ఎరువుల పేరిట రైతులకు ఎరువు లను విక్రయిస్తున్నారు. 5 బస్తాల ఎరువులు తీసుకుంటే దానికి అనుబంధంగా ఒక సేంద్రీయ ఎరువుల మందును వ్యాపారులు రైతులకు విక్రయిస్తున్నాయి. ముగ్గురు రైతులు తమ పంటకు కావాల్సిన 30 బ్యాం కుల వంతున 90 బస్తాల ఎరువులను కొనుగోలు చేశారు. ఎరువులు చల్లేటప్పుడు తప్పనిసరిగా ఆయ మందును కలపాలంటూ వ్యాపారులు చెప్పడంతో రైతులు ఆవిధంగానే చేశారు. తీరా ఎరువుల బ్యాగ్లు తెరిస్తే ఇసుకు ఎక్కువగా ఉండడంతో రైతులు ఆందోళన చెందారు రాష్ట్రంలోని వనపర్తి తదితర జిల్లాల్లో ఈ నకిలీ, నాసిరకం ఎరువులను రైతులకు విక్రయిస్తున్నారు.