కలిపి తినకూడదు

eating ee
Eating 

కలిపి తినకూడదు

ఉదయాన్నే కార్బొహైడ్రేట్‌లు పుష్కలంగా ఉన్న బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు కొందరు పళ్లముక్కల్ని తిని ఆరోగ్యంగా ఉంటున్నాం అనుకుంటారు. అది కరెక్టు కాదు. ఒక్క బ్రేక్‌ఫాస్ట్‌లోనే కాదు మిగతా రోజంతా కూడా ఎప్పుడు ఆహారం తీసుకున్నా కొన్ని పదార్థాలను కలిపి తినకూడదు. అలా తిన్నారంటే జీర్ణసంబంధిత సమస్యలు తలెత్తుతాయి అంటున్నారు న్యూట్రిషనిస్టులు. ఆ వివరాలే ఇవి…

ఏవేవి కలపకూడదు…

పళ్లు, కార్బొహైడ్రేట్‌లు కలిపితే మంచి బ్రేక్‌ఫాస్ట్‌ అవ్ఞతుందనుకుంటారు చాలామంది. కాని అలా కలపడం వల్ల పళ్ల నుంచి విడుదలయ్యే ఆమ్లాలు కార్బొహైడ్రేట్‌లను జీర్ణం కాకుండా అడ్డుపడతాయి. అందుకని ముందు విడిగా పళ్లు తినడం శ్రేయస్కరం.

కార్బొహైడ్రేట్‌లను యానిమల్‌ ప్రొటీన్‌తో కలిపి తింటే సరిగా జీర్ణం కావ్ఞ. దాంతో కడుపు ఉబ్బరం, పులితేన్పులు వచ్చి విపరీతంగా ఇబ్బందిపడతారు.
అందుకే పాలు, పాల ఉత్పత్తులతో పాటు పళ్లు కలిపి తినకూడదంటారు. అలాగే పెరుగులో పండు కలుపుకుని తినడం వల్ల కూడా జీర్ణక్రియ సరిగా జరగదు. దాంతో ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, పులితేన్పులు వంటి సమస్యలు వస్తాయి.

భోజనం చేసేటప్పుడు ద్రవపదార్థాల్ని తీసుకోవడం మంచిది కాదు. ఇలా చేసినా జీర్ణ క్రియ సరిగ్గా జరగదు. అందుకనే ఆహారం తీసుకునే 30నిమిషాల ముందు నుంచీ ద్రవప దార్థాలేవీ తీసుకోకూడదు. అలాగే తిన్నాక రెం డు గంటల వరకు ద్రవపదార్థాలు తాగొద్దు. ఒకవేళ నీళ్లు తాగాలనిపించినా నాలుక తడుపు కునేవరకే కాని ఎక్కువగా తాగకూడదు.