కలవరపాట్లు – కప్పదాట్లు

political parties
political parties

సంపన్నులు, వ్యాపారులు,ఆయారంగాలలో అందెవేసిన వారు ప్రస్తుతం ఎన్నికల బరిలో నిలిచేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. అదే అదునుగా ఆయారామ్‌, గాయారామ్‌లు రెడీ అయ్యారు. వీరు ఫలానా పార్టీలో ఉన్నారా అనే సందేహాన్ని కలిగిస్తున్నారు. గడిచిన కాలంలో ఎన్నో ఏళ్లు ఓ పార్టీలో ప్రజలకు సేవలందించి ఆ పార్టీల తరపున సిద్ధాంత వ్యక్తీకరణకు పేరుగా నిలిచేవారు. మారుతున్న కాలంలో సాంకేతికత ఊహించనంత వేగంగా దూసుకెళ్లుతున్న ఈ తరుణాన కొత్తగా నేతలు తెరమీద కొస్తున్నారు. ఈ పాటికే రాజకీయ ప్రవేశం చేసిన భూమికను పోషించిన వారు సైతం పార్టీలు మారుతుండటం ప్రస్తుతం చర్చనీయాంశమవ్ఞతున్నది.

ఎన్నికలు రాజకీయాలకు వేదిక. రాజకీయ పక్షాలకు కలిసొచ్చేకాలం. నడిసొచ్చేకాలం. ఐదేళ్లకోసారి వచ్చే ఈ ఓట్ల పండు గకు సర్వత్రా ఆసక్తి నెలకొంటుంది. పార్టీలకు, ఆ పార్టీల పంచన చేరే వర్గీయులకు కీలక సమయమిది. గతంతో పోలిస్తే రాజకీయ వేదికలపై ఎన్నో సంచలనాలు చోటు చేసుకు న్నాయి. ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యేందుకు సరికొత్తబాటలు పరుచుకుంటున్నారు. సంపన్నులు, వ్యాపారులు,ఆయారంగాలలో అందెవేసిన వారు ప్రస్తుతం ఎన్నికల బరిలో నిలిచేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. అదే అదునుగా ఆయారామ్‌, గాయారామ్‌లు రెడీ అయ్యారు. వీరు ఫలానా పార్టీలో ఉన్నారా అనే సందేహాన్ని కలిగిస్తున్నారు. గడిచిన కాలంలో ఎన్నో ఏళ్లు ఓ పార్టీలో ప్రజలకు సేవలందించి ఆ పార్టీల తరపున సిద్ధాంత వ్యక్తీకరణకు పేరుగా నిలిచేవారు.

మారుతున్న కాలంలో సాంకేతికత ఊహించనంత వేగంగా దూసుకెళ్లుతున్న ఈ తరుణాన కొత్తగా నేతలు తెరమీద కొస్తున్నారు. ఈ పాటికే రాజకీయ ప్రవేశం చేసిన భూమికను పోషించిన వారు సైతం పార్టీలు మారుతుండటం ప్రస్తుతం చర్చనీయాంశమవ్ఞతున్నది. సాధారణంగా మనందరం అనుకుంటు న్నట్లు రాజకీయం అంటే సమాజ సేవ, సేవ చేసేందుకు రాజకీ యాన్ని ఒక వేదికగా భావిస్తుంటారు. గతంలో రాజకీయ నాయకులను చూస్తే ప్రజలలో ప్రేమాభిమానాలు పెల్లుబుకేవి. అలాంటి నేతల సేవలు పొంది ప్రజలు ఎంతో సంతోషించేవారు. ఇప్పటికీ కొద్దిమందైనా అలాంటి నేతలను ప్రజలు మరిచిపోక పోవడం గమనార్హం.

కాలక్రమంగా సేవ అనేది కాస్తా డబ్బుమ యంగా రూపాంతరం చెందింది. ఓటరు భావ జాలాన్ని సైతం మారిపోయేలా మన రాజకీయ నేతల అడుగులు పడుతున్నాయి. ఆయనొస్తే నాకేంటి లాభం అనే దిశగా గమనం సాగడం ప్రస్తుతం మనందరం చూస్తున్నాం. వ్యక్తిగత లాభం ఏమిటన్న దిశగా ఓటర్లు ఆలోచించడంతో రాజకీయ నాయకులు సైతం దీన్ని క్యాష్‌ చేసుకుంటున్నారు. ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. మునుపెన్న డూ లేని విధంగాడబ్బు ప్రధానాంశమైంది. కాస్తో, కూస్తో ప్రజలకు సాయపడదామని ఆలోచిస్తే అది అందనంత దూరంలోనే ఉంటోంది. డబ్బున్న వాడే ఎన్నికల్లో గెలుస్తాడు. నిలుస్తాడు అనేలా ఇప్పటి రాజకీయరంగం ఆవిష్కృతమవ్ఞతోంది.

దోచుకుంది దాచుకుంది కాపాడుకునేందుకు పలుకుబడి, పరపతి పొందేందుకు అన్ని వర్గాల్లోని వారు రాజకీయాలలోకి ప్రవేశిస్తున్నారు. ఇలాంటి వారి చర్యల వల్ల వాస్తవంగా ప్రజలకు సేవ చేసే నేతలు దాదాపుగా కరవయ్యారని అందరూ భావిస్తున్నారు. ఒకప్పుడు సభలు సమావేశాలు అంటే ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి మీటింగులను, సభలను జయప్రదం చేసేవారు. వారిచ్చే విశ్లేషణలను, స్ఫూర్తిని ఆకళింపు చేసుకునేవారు. ఆలోచించి నడుచుకునేందుకు ఆయత్తమయ్యేవారు. కానీ కాలక్రమేణా నేడు సభలు, సమావేశాలు నిర్వహించాలంటే అంతాడబ్బుతోనే అడుగు పెట్టడం ఆ పార్టీ నేతలకు జేజేలు కొట్టడం షరా మామూలైంది.

ఇక ఎన్నికలొచ్చే సరికి రకరకాల కారణాలు చెప్పి, విమర్శలు గుప్పించి వేరే పార్టీలోకి దూకడం సరేసరి. ఈ జంపింగులను ప్రజలు,పెద్దలు పెద్దగా పట్టించుకోవడం లేదంటూ వారే ప్రజలకు బ్రెయిన్‌ వాష్‌ చేయడం ఇప్పటి రాజకీయాల పరమార్థమైంది. తమస్వార్థం లేదా భేషజాలను పక్కనపెట్టి సవాలక్ష కారణాలున్నా యనే సందేశమిచ్చేలా పార్టీలు మారడం ప్రస్తుతం పాలిట్రిక్స్‌గా మారింది. ఒక పార్టీలో ఉన్నంతకాలం ఆ పార్టీని, ఆ పార్టీ అధినేతలను కీర్తించడం, మరో పార్టీని విమర్శిస్తూ బజారు కీడ్చి మాట్లాడం, ఈ ఐదేళ్లలో పార్టీ అంటే నేనేనన్న విధంగా నడిచిన నేతలు ఓ రోజు గడిచాక తాను ఎంతో క్షోభ అనుభవించానని ప్రజల ముందుకు రావడం చూస్తూనే ఉన్నాం.

పార్టీ మారే సమయంలో తానొక్కడినే నీతిమంతుడినని చెప్పడంతో ఈ దిశగా ప్రజానీకంలో ఆలోచించి వ్యవహరించే తత్వం, సహనం లేకపో వడం శోచనీయం. ఇదే అదునుగా రాజకీయ పక్షాలు తమదైన శైలిలో చక్రం తిప్పుతునానరు. ప్రజల బలహీనతల్ని సొమ్ము చేసుకోవడానికి పరుగులు పెడుతున్నారు. అన్నింటికీ డబ్బేమూల మన్న సూత్రాన్ని వల్లిస్తూ ప్రలోభాలు పెడుతూ అసలు తన పార్టీ మార్పిడికి గల కారణాలను మాత్రం నిర్దిష్టంగా నిజాయితీగా వెల్లడించే నాయకులే లేరని ప్రతిచోటా వినిపిస్తోంది. ప్రస్తుతం ఎన్నికల వేదికగా మారిన ఆంధ్రప్రదేశ్‌ అంతటా ఈ కప్పదాట్ల వ్యవహారమే నడుస్తోంది.

అధికార తెలుగుదేశంలో ఐదేళ్లూ అన్ని అనుభవించి, తమతమ పనులను నెరవేర్చుకుని, వచ్చేఎన్నికలలో తనకు సీటు ఎక్కడా లభించదేమోనన్న అనుమానం పలువ్ఞరు టిడిపి నేతలను వెంటాడుతోంది. మరోవైపు వైకాపాలో కొనసా గుతూ అక్కడ కూడా తనకు సీటు లభించదేమోననికొందరు టిడిపిలోకి జారుకోవడం జరుగుతోంది. ఇక ఈ రెండు పార్టీల లోనూ రిక్తహస్తమై లభిస్తుందేమోనన్న శంకతో మూడో పార్టీ జెండా పట్టడం జరుగుతుంది. వాస్తవానికి ఆ పార్టీలలో చిత్తశుద్ధి తో పనిచేసి, ప్రజాసేవ చేస్తే సీట్లు ఎందుకు లభించవన్న వాదనను విజ్ఞులు వక్కాణిస్తున్నారు. నేతలు, ప్రజాప్రతినిధులు నివేదించే సమస్యలు, కారణాలు పక్కనబెడితే అప్పటిదాకా వారి వెంట నడిచిన కార్యకర్తల మాటేమిటి?

ఎన్నికలయ్యాక అయిదేళ్ల ముగింపువేళ సదరు నాయకుడు పార్టీ మారిపోతే కార్యకర్తలకు అండగా నిలబడేది ఎవరు? నాయకుడు ఎవరైనా ఆ పార్టీపై అభిమానంతో అధినేతపై అనురాగంతో నెత్తురును చిందించే నైజం ఉన్న కార్యకర్తలను ఈ గాయారామ్‌లు విస్మరిస్తుండటం నేటి రాజకీయ అంతర్గత పరిశీలనలో చెప్పుకోతగ్గ పరిణామం. ఇలా పార్టీని వదిలి వెళ్లుతున్న నేతల తీరుపై నేడు రాష్ట్రంలో అన్ని పార్టీల కార్యకర్తలు, అభిమానులు, తీవ్ర నిరాశ, నిస్పృ వ్యక్తం చేస్తున్నారు. అధినేత అంటే మార్గదర్శకుడిగా భావిస్తూ ఆ అధినేత సూచించే నాయకుడి వెనుక నడిచే ఆ నేత బాటే తనకు స్ఫూర్తిగా భావించి ఎన్నికల సమయంలో అనేక కష్టాలను ఎదుర్కొనిముందు కు సాగితే తీరా ఎన్నికలు ముగిశాక కనీసం వారి పరిస్థితులను పట్టించుకోకపో వడం నేటికీ బాధిస్తోందని కార్యకర్తలు, అభిమాను లు ఊళ్లు, పట్టణాలు, నగరాల్లోని చర్చావేదికలు, ప్రధాన కూడళ్ల వద్ద తమ అంతరంగాన్ని వెళ్లగక్కుతున్నారు.

అధికార దాహంతో నేతలు పార్టీలు మారుతున్నారే తప్ప కార్యకర్తలు చాలా మంది నేటికీ ఆయా పార్టీలనే నమ్ముకుని ఉండటం కూడా గమనార్హమే. ఇప్పటికైనా రాజకీయ పార్టీల అధినేతలు కార్యకర్తలను దృష్టిలో ఉంచుకొని పార్టీకోసం, ప్రజలకోసం పనిచేసే మంచి మనసు ఉండే నేతలనే పోటీలోకి దింపాలని పలువ్ఞరు కోరుతున్నారు. ఎన్నికల నగారా మోగుతున్న ఈ సమయంలో అసమ్మతులు, అసంతృప్తు లు ఎప్పట్లాగే ఉంటున్నాయి. ముఖ్యంగా సీటు రాదేమోనన్నదే ప్రధాన అంశంగా మారుతోంది. మరోవైపు వలసల దిశగా పయనిస్తున్న నేతల వల్ల తమ ప్రయోజనాలు దెబ్బతింటాయేమో నన్న సందేహమే వారిని పీడిస్తోంది. అందుకే ఈ గోడ దూకుళ్ల స్పీడు పెరిగిపోయింది. అందుకే నిర్ణయం కాని, సందిగ్ధంలో ఉన్న సీట్లలో ఈ ఆందోళన మరీ ఎక్కువగా ఉంది. టిక్కెట్‌ ఇస్తారా? లేదా త్వరగా తేల్చండంటూ ఆయా పార్టీల అగ్రనాయకత్వంపై ఒత్తిడులు మితిమీరాయి. ఇక నేతల్లో భయం అంతా ఇంతా కాదు.

పార్టీ సర్వేల్లో, నివేదికల్లో వెనుకబాటుతనం పెద్ద సమస్య గా భయాందోళనలను రేకెత్తిస్తోంది. అంతేకాకుండా కొన్ని స్థానాల్లో పోటీదారులు పెరగడం, దీనికితోడు డబ్బే కీలకాంశంగా మారడం, కులం కార్డు తెరపైన తిష్ట వేయడం ఇత్యాది అంశాలు అభ్యర్థుల పోటీ అంశాన్ని ప్రభావితం చేస్తున్నాయని రాజకీయ పండితుల విశ్లేషణగా ఉంది. నియోజకవర్గాల్లో అవినీతి, అక్రమాలు, అను కోని సంఘటనలు జరగడం ఆయా అభ్యర్థిత్వాలకు గండికొడు తోంది.ఏతావాతా మనం చెప్పుకుంటున్న ఈ కారణాల వల్లే అన్ని పార్టీల్లోనూ జంపింగ్‌లు పెరిగిపోతున్నాయి. సమకాలీన రాజకీయ చట్రంలో నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌ల సంస్కృతి బాగా పెరిగిపో యింది. ప్రతి పార్టీకి ఒక నియోజకవర్గ ప్రతినిధి ఉంటే మేలని భావించి అన్ని పార్టీల్లోనూ ఇన్‌ఛార్జ్‌లను నియమించారు.

ఈ అయిదేళ్ల పాలనా కాలంలో ఈ ఇన్‌చార్జ్‌లే బాధ్యులుగా ఉండి కథ నడిపారు. తీరా ఎన్నికల సమయంలో ఈ ఇన్‌చార్జ్‌ల పరిస్థితి అయోమయంలో పడుతోంది. చాలా చోట్ల ఇన్‌చార్జ్‌ల బెడద పార్టీలను వెన్నాడుతోంది. టిక్కెట్ల విషయంలో సర్దుబాటు చేయలేక, నిర్ణయం తీసుకోలేక పెండింగ్‌ పెడుతున్నారు. ఇప్పుడే సమస్య వచ్చి, ఒత్తిడులు, ఆందోళనలు, ఆగ్రహాలు పార్టీ నాయకత్వాలకు సవాల్‌గా మారుతున్నాయి. సరిగ్గా ఇక్కడే గుడ్‌బైలు, జంపింగ్‌లు ముందుకొస్తున్నాయి. అందుకే డబ్బు ఉన్న వాడికే సీటు అంటున్నారు. డబ్బుల్లేకుండా, నిజాయితీగా పోటీచేసి గెలిస్తే అది గిన్నిస్‌ రికార్డే అంటూ జోకులు పేలుతున్నాయి. దాని కారణం ప్రజల ఆలోచనల్లో మార్పు రావడం, సబ్సిడీలు, సంక్షేమ పథకాలు పెచ్చు మీరుతున్నాయన్న వాదన వినపడటం. డబ్బుకే ఓటింగ్‌ విలువ మొగ్గు కనపడటం వగైరాలను పేర్కొనవచ్చు.

  • చెన్నుపాటి రామారావు