కలకలం రేపుతున్న రేవంత్ ఫిర్యాదు

REVANTH REDDY
REVANTH REDDY

హైదరాబాద్‌:కేబినెట్ విస్తరణపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్‌కు, కేంద్ర ఎన్నికల కమిషన్‌కు నేడు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. రేపు ఉదయం 11:30 గంటలకు 10 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండగా.. రేవంత్ ఫిర్యాదు కలకలం రేపుతోంది. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ నేపథ్యంలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడం.. ఎన్నికల కోడ్ ఉల్లంఘన అవుతుందని రేవంత్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నికల సంఘం అనుమతి లేకుండా కేబినెట్ విస్తరణ చేపడితే చర్య తీసుకోవాలని కోరారు.