కర్ణాటకలో బిజెపిపైనే ప్రజల్లోవ్యతిరేకత: సీఎం సిద్ధరామయ్య

 

Siddha ramaiah
Siddha ramaiah

బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్‌ వ్యతిరేకత లేదని,కేవలం బిజెపిపట్ల వ్యతిరేకతమాత్రమే ఉన్నదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. గురువారంబెలగావి వద్ద జరిగిన కాంగ్రెస్‌ర్యాలీలో పాల్గొన్న ముఖ్యమంత్రి ఎన్నికల్లో తిరిగి కాంగ్రెస్‌ విజయపతాకమే తథ్యమనిఅన్నారు. కర్నాటకలోవచ్చే ఏప్రిల్‌మేనెలల్లో అసెంబ్లీ ఎన్నికలు రుగనున్న సంగతి తెలిసిందే. ర్యాలీనుద్దేశించి సిద్దరామయ్యమాట్లాడుతూ బిజెపి,మోడీలపట్లవ్యతిరేకత ఎక్కువగా ఉందని అన్నారు. ఇప్పటికే ప్రధానినరేంద్రమోడీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాలుకర్నాటకపై కన్నేసారని అన్నారు అయితేలోక్‌సభ ఎన్నికల్లోమోడీకి ఉన్న ఆనాటి చరిష్మా నేడు లేదని దిగజారిందని అన్నారు. ఇటీవలేజరిగిన గుండ్లుపేట్‌, నంజన్‌గూడ్‌ ఉప ఎ న్నికలే ఇందుకునిదర్శనమనిసీఎం అన్నారు. ఓటర్లు కాంగ్రెస్‌కేఓటువేసారన్నారు. బిజెపి అనుసరిస్తున్న హిందూత్వవైఖరినిప్రస్తావిస్తూ ఆపార్టీ ఆసాంతం హిందూత్వాన్ని సొంతం చేసుకుందాఅనిప్రశ్నించారు. రాష్ట్రప్రభుత్వంరైతుల రుణాలనుమాఫీచేసిందని,కేంద్రం ఎలాంటి తోడ్పాటురాష్ట్రానికి అందించలేదని అన్నారు. రాష్ట్ర బిఎపి అధ్యక్షుడుయెడ్డ్యూరప్ప అనేకసభల్లోమాట్లాడుతూ తానుకేంద్రం దృష్టికి తీసుకెళ్లి తోడ్పాటుకు కృషిచేస్తానని చెప్పిన అంశాన్ని గుర్తుచేశారు. మాజీప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌రైతులరుణాలనుమాఫీచేసారన్నారు. అదే కేంద్రం మాఫీని చేసేందుకు వీలుగా యెడ్యూరప్ప ప్రభుత్వాన్నిఘెరావ్‌చేయమనండని పిలుపునిచ్చారు. మతపరమైన బిజెపి, అవకాశ వాద జెడిఎస్‌లను అనుమతించవద్దని అధికారంలోనికిరానీయొద్దని అన్నారు.